Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కం డైరెక్ట‌ర్ సంపాద‌న 100కోట్లు?

పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తులు, ఆస్తులు, కార్లు, ఇళ్లు మరియు వ్యాపారాలు ప‌రిశీలిస్తే.. కొచ్చి సమీపంలోని ఒక సొగసైన బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   20 May 2024 4:02 AM GMT
స్టార్ హీరో కం డైరెక్ట‌ర్ సంపాద‌న 100కోట్లు?
X

ట్యాలెంట్ ఎక్క‌డ ఉన్నా ప్ర‌పంచం మొత్తానికి తెలుస్తుంది. అలాంటి ప్ర‌తిభావంతుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా ఆల్ రౌండ‌ర్ ప‌నిత‌నంతో దేశ‌వ్యాప్తంగా సినీప‌రిశ్ర‌మ‌ల్ని ఆక‌ర్షిస్తున్నాడు అత‌డు. ఇటీవ‌ల టాలీవుడ్, బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోను అత‌డు పాపుల‌ర‌య్యాడు. పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్నాడు. ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో తన తొలి చిత్రం 'నందనం'తో నటుడిగానే కాకుండా గాయకుడిగా, నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

ఆస‌క్తిక‌రంగా విదేశాల నుంచి ఇండియాకి వ‌చ్చి న‌టుడైన అత‌డు కేవ‌లం 42 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేప్ప‌టికి సినీప‌రిశ్ర‌మ నుంచి 70 కోట్లు సంపాదించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ 40వ బ‌ర్త్ డే స‌మ‌యంలో మలయాళ సినిమా ప్రపంచంలోని అత్యంత ధనిక నటులలో ఒకరిగా ఎదిగిన‌ట్టు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత అజేయంగా వ‌రుస‌గా విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టిస్తున్నాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం 19 సంవత్సరాల వయస్సులో మలయాళ చిత్రసీమలో నటుడిగా ప్రవేశించాడు. అతడు ఆస్ట్రేలియాలో చదువుతున్నప్పుడు దర్శకుడు ఫాజిల్ స్క్రీన్ టెస్ట్ కోసం అతడిని తీసుకువచ్చాడు. నటన ఎప్పుడూ తన రక్తంలోనే ఉంది కాబట్టి పృథ్వీరాజ్ ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే అనుకోని కారణాల వల్ల దురదృష్టవశాత్తు ఆ సినిమా సెట్స్ కెళ్ల‌లేదు. 2002లో పృథ్వీరాజ్ సుకుమారన్ 'నందనం' సినిమాతో అరంగేట్రం చేశారు. అయితే ఈ చిత్రం 'నక్షత్రక్కన్నుల్లా రాజకుమారన్ అవనుండోరు రాజకుమారి' (2002) కమర్షియల్‌గా పరాజయం పాలైన తర్వాత విడుదలైంది. ఆ తర్వాత వినయన్‌, లోహితదాస్‌, భద్రన్‌, శ్యాంప్రసాద్‌ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవ‌ల మోహ‌న్ లాల్ తో క‌లిసి లూసీఫ‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పృథ్వీరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల స‌లార్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రంలో ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించాడు. త‌దుప‌రి స‌లార్ 2లోను న‌టించ‌నున్నాడు.

ప‌రిశ్ర‌మ‌లో రెండు ద‌శాబ్ధాల‌ కెరీర్ లో పృథ్వీరాజ్ సుమారు 52 కోట్లు ఆర్జించార‌ని 2022లో క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత అత‌డు వ‌రుస‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. పృథ్వీరాజ్ ప్రతి చిత్రానికి రూ. 3-4 కోట్లు వసూలు చేస్తార‌ని సమాచారం. అతడి నెలవారీ ఆదాయం రూ.2 కోట్లు. వార్షిక ఆదాయం దాదాపు రూ. 10 కోట్లు. ఓవ‌రాల్ గా చూసుకుంటే ఇప్ప‌టికి అత‌డు 70 కోట్ల వ‌ర‌కూ ఆర్జించాడ‌ని ఒక అంచ‌నా.

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వ‌గ‌తంలోకి వెళితే.. సుకుమారన్ - మల్లికా సుకుమారన్‌లకు జన్మించాడు. పృథ్వీరాజ్ తల్లిదండ్రులు సినిమా వ్యాపారంలో ఉన్నారు. అత‌డు తిరువనంతపురంలో పుట్టి చెన్నైలో పెరిగాడు. పృథ్వీరాజ్ డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఆస్ట్రేలియా వెళ్లి బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌లో చేరాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ BBC ఇండియా కరస్పాండెంట్ సుప్రియా మీనన్‌ను 25 ఏప్రిల్ 2011న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అలంకృత అనే కుమార్తె ఉంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తులు, ఆస్తులు, కార్లు, ఇళ్లు మరియు వ్యాపారాలు ప‌రిశీలిస్తే.. కొచ్చి సమీపంలోని ఒక సొగసైన బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇది కాకుండా అనేక రాష్ట్రాలలో ప‌లు ఆస్తులను కలిగి ఉన్నాడు. పృథ్వీరాజ్ సుకుమార్ లంబోర్ఘిని హురాకాన్ LP 580-2 , ఉరుస్ వేరియంట్‌లకు సొంతం చేసుకున్నాడు. ఒక మినీ కూపర్ JCW, పోర్స్చే కెయెన్ , టాటా సఫారీ కార్లు ఉన్నాయి. ఇవేగాక గ్యారేజీలో ఇంకా ప‌లు మోడ‌ళ్ల కార్లు ఉన్నాయి.

పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఇటీవ‌లే ది గోట్- ఆడు జీవితం చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. త‌దుప‌రి స‌లార్ 2తో పాటు పలు భారీ మ‌ల్టీస్టార‌ర్ల‌లో న‌టిస్తూ పారితోషికాలు అందుకుంటున్నాడు. అత‌డి నిక‌ర ఆస్తులు మ‌రో రెండు మూడేళ్లలోనే 100 కోట్లకు చేరుకుంటాయ‌ని విశ్లేషిస్తున్నారు.