Begin typing your search above and press return to search.

ఆ సమయంలో నా ఫ్యామిలీ చాలా టెన్షన్‌..!

సలార్‌ సినిమాతో నటుడిగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ తో కలిసి అలరించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌

By:  Tupaki Desk   |   27 March 2024 6:30 AM GMT
ఆ సమయంలో నా ఫ్యామిలీ చాలా టెన్షన్‌..!
X

సలార్‌ సినిమాతో నటుడిగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ తో కలిసి అలరించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌. ఈయన ఈనెల 28న ది గోట్ లైఫ్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ కు వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్‌ మీడియాతో ముచ్చటించాడు.

పృథ్వీరాజ్ మాట్లాడుతూ... తన సుదీర్ఘ సినీ కెరీర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన నజీబ్ అనే వ్యక్తికి సంబంధించిన కథ ఇది. కథ డిమాండ్ మేరకు నేను ఏకంగా 31 కేజీల బరువు తగ్గాను. సహజ పద్దతుల్లో కష్టపడి బరువు తగ్గాను. ఆ సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా టెన్షన్ పడ్డారు.

నా భార్య మరియు పాప నేను సినిమా కోసం పడుతున్న కష్టం చూసి టెన్షన్‌ పడ్డా కూడా అర్థం చేసుకున్నారు. వారు నాకు పూర్తిగా సహకరించారు. చిత్రీకరణ మొత్తం కూడా ఎడారిలో నజీబ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎంతటి దుర్భర జీవితాన్ని ఎదుర్కొన్నాడు అనే విషయాలను చూపించేందుకు ప్రయత్నించాం.

ఆల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరించే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. సినిమా షూట్‌ చేస్తున్న సమయంలోనే మేము ఒక గొప్ప సినిమా చేస్తున్నాం అని అనుకున్నాం. ఆ నమ్మకమే మమ్ములను ముందుకు నడిపించింది అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.