Begin typing your search above and press return to search.

రీమేక్‌ ల గురించి 'సలార్' నటుడి షాకింగ్‌ కామెంట్స్‌!

మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 March 2024 11:30 AM GMT
రీమేక్‌ ల గురించి సలార్ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌!
X

మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ది గోట్‌ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

పాన్ ఇండియా రేంజ్ లో ది గోట్ లైఫ్ సినిమాను పెద్ద ఎత్తున పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమోట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్‌ ది గోట్ లైఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్‌ లో ఉన్నాడు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌ లో తన సినిమా ప్రమోషన్ లో ఆయన పాల్గొంటాడు.

ఇటీవల తెలుగు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను దర్శకత్వం చేసిన సినిమాలకు సీక్వెల్‌ చేసేందుకు సమయం దొరకడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. తన సినిమాలు తెలుగు లో రీమేక్‌ అవ్వగా అందులో గాడ్‌ ఫాదర్ మరియు భీమ్లా నాయక్‌ ను చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. తాను చేసిన ముంబై పోలీసు ను తెలుగు లో హంట్ పేరు తో రీమేక్ చేసిన విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు.

భవిష్యత్తులో రీమేక్ లు అనేవి ఉండవు. ప్రతి సినిమా పాన్‌ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో విడుదల అవుతున్నాయి. కనుక ముందు ముందు రీమేక్ లు చేసే స్కోప్ ఉండదు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకే సారి అన్ని భాషల్లో విడుదల అవ్వడం వల్ల రీమేక్‌ లు ఉండవు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.