మాలీవుడ్ స్టార్ హీరోగా టాలీవుడ్ సినిమా!
మాలీవుడ్ సంచలనం పృధ్వీరాజ్ సుకుమారన్ టాలీవుడ్ లో కీలక పాత్రలలో మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 April 2025 3:00 PM ISTమాలీవుడ్ సంచలనం పృధ్వీరాజ్ సుకుమారన్ టాలీవుడ్ లో కీలక పాత్రలలో మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `సలార్` లో వరదరాజ్ మన్నార్ పాత్రతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. దీంతో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కూడా ఎస్ ఎస్ ఎంబీ 29లో అవకాశం ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో పృధ్వీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.
మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కానీ సెలక్టివ్ గా టాలీవుడ్ కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడీ నయా స్టార్ టాలీవుడ్ లో హీరోగా ప్రమోట్ అవుతున్నట్లు తెలుస్తోంది. పృధ్వీరాజ్ హీరోగా వంశీ పైడిపల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడుట. దీన్నీ ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించ బోతుందని సమాచారం. ఇటీవలే పృథ్వీకి స్టోరీ వినిపించినట్లు నచ్చడంతో ఆయన ఒకే చెప్పినట్లు వినిపిస్తుంది.
హీరోగా టాలీవుడ్ లో లాంచింగ్ కూడా ఇదే సరైన సమయమని పృథ్వీ కాన్పిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత పృథ్వీ `పోలీస్ పోలీస్` అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఇది తమిళ అనువాద చిత్రంం. ఈ సినిమా 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ `సలార్` తోనే పృథ్వీ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు నేరుగా హీరోగానే రెడీ అవుతున్నాడు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.
పరభాషా హీరోల్ని డైరెక్ట్ చేసిన అనుభవం వంశీకి ఉంది. `ఊపిరి`తో కార్తీని తెలుగులో లాంచ్ చేసాడు. అప్పటికే అనువాద చిత్రాలతో కార్తీ టాలీవుడ్ లో ఎంతో ఫేమస్. కానీ కార్తీ అంతగా వెలుగులోకి పృథ్దీరాజ్ ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. డైరెక్టర్ గా పృధ్వీ చేసిన సినిమాలు తెలుగులో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.
