Begin typing your search above and press return to search.

హనుమాన్ మేకర్స్.. ఇది ఊహించని కాంబో!

ఈ మూవీ మరింత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2గా స్టార్ హీరో సినిమా రావొచ్చని అందరూ భావించారు.

By:  Tupaki Desk   |   11 March 2024 4:07 AM GMT
హనుమాన్ మేకర్స్.. ఇది ఊహించని కాంబో!
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. నిరంజన్ రెడ్డి ఈ ప్రొడక్షన్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే పాన్ ఇండియా మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు. భారీ లాభాలు కూడా సినిమాతో సొంతం చేసుకున్నాడు. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ కూడా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లోనే తెరకెక్కనుంది.

ఈ మూవీ మరింత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2గా స్టార్ హీరో సినిమా రావొచ్చని అందరూ భావించారు. అయితే తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుంచి అవుట్ అండ్ అవుట్ క్రేజీ కామెడీ కథాంశంతో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారంట. ఈ సినిమాతో కొత్త దర్శకుడిని టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నభా నటేష్ చివరిగా 2021లో మ్యాస్ట్రో మూవీలో నితిన్ కి జోడీగా నటించింది. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత ఆక్సిడెంట్ కావడంతో కొంతకాలం సినిమాలకి దూరం అయ్యింది. మళ్ళీ కోలుకొని యాక్టివ్ అయ్యి ఆఫర్స్ కోసం ట్రై చేస్తోంది.

ఇలాంటి సమయంలో ప్రియదర్శికి జోడీగా కామెడీ మూవీలో ఛాన్స్ రావడం విశేషం. బలగం సూపర్ హిట్ తర్వాత ప్రియదర్శికి హీరోగా అవకాశాలు పెరిగాయని చెప్పొచ్చు. అయితే ఓ వైపు కమెడియన్ గా కెరియర్ కొనసాగిస్తూనే సెలక్టివ్ గా హీరో క్యారెక్టర్స్ ని ప్రియదర్శి చేస్తున్నాడు. అది కూడా ఎక్కువగా కామెడీ టచ్ ఉన్న కథలనే నమ్ముకుంటున్నాడు.

ఈ సారి కూడా అలాంటి సినిమానే హనుమాన్ ప్రొడ్యూసర్ తో చేయబోతున్నాడు. నిరంజన్ రెడ్డి కూడా లో బడ్జెట్ లో ఈ సినిమాని చేసి కంటెంట్ బేస్డ్ కథలని కూడా తన ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తానని యువ దర్శకులకి సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి హనుమాన్ తో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారిన నిరంజన్ రెడ్డికి ఈ కామెడీ మూవీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.