Begin typing your search above and press return to search.

ప్రీమియర్ షోలు.. ఇంకా బలంగా..

ఈ మధ్యకాలంలో ప్రీమియర్ షోల సంస్కృతి ఎక్కువ అయ్యింది. గతంలో ప్రీమియర్ షోలు కేవలం స్టార్ హీరోల చిత్రాలకి అది కూడా థియేటర్స్ లో ఉదయం ఐదు గంటలకి ప్రదర్శించేవారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 4:20 AM GMT
ప్రీమియర్ షోలు.. ఇంకా బలంగా..
X

ఈ మధ్యకాలంలో ప్రీమియర్ షోల సంస్కృతి ఎక్కువ అయ్యింది. గతంలో ప్రీమియర్ షోలు కేవలం స్టార్ హీరోల చిత్రాలకి అది కూడా థియేటర్స్ లో ఉదయం ఐదు గంటలకి ప్రదర్శించేవారు. సిటీలో ఒకటి, రెండు థియేటర్స్ లలో మాత్రమే ఇలా ప్రీమియర్ షోలని బెన్ ఫిట్ షో పేరుతో ప్రదర్శించేవారు. అయితే క్రమంగా ఇవి తగ్గిపోయాయి.

అయితే ఓవర్సీస్ లో మాత్రం ముందుగానే సినిమా థియేటర్స్ లో పడుతున్నాయి. అందుకే ఇండియాలో థియేటర్స్ లో మూవీ ప్రదర్శించే సమయానికి టాక్ సోషల్ మీడియా ద్వారా బయటకి వచ్చేస్తోంది. ఈ టాక్ సినిమాకి ఆడియన్స్ పెరగడంలో కొన్ని సార్లు ఉపయోగపడుతోంది. కొన్ని సార్లు మాత్రం ఈ సోషల్ మీడియాలో ఓవర్సీస్ నుంచి వచ్చే పబ్లిక్ టాక్ సినిమా ఓపెనింగ్స్ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.

ఈ మధ్య పెయిడ్ ప్రీమియర్స్ కూడా నిర్మాతలు కొంతమంది మీడియా ప్రతినిధుల కోసం, ఇండస్ట్రీ సర్కిల్ లో ఉన్నవారికోసం ప్రదర్శిస్తున్నారు. వీటి నుంచి వచ్చే టాక్ సినిమాలకి ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు. అవుట్ పుట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న దర్శక, నిర్మాతలు ఈ పెయిడ్ ప్రీమియర్స్ వేసి టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ప్రీమియర్స్ ద్వారా మంచి టాక్ తెచ్చుకున్న చిన్న చిత్రం మ్యాడ్. ఈ మూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

తాజాగా నాని సినిమా కూడా కొంతమంది క్లోజ్ సర్కిల్ లో ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రదర్శించారు. వారి నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో పాటు ఆడియన్స్ లోకి పాజిటివ్ వైబ్ వెళ్ళింది. దీంతో హిట్ టాక్ సొంతం చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ తో మూవీ దూసుకుపోతోంది. అయితే ప్రీమియర్స్ లో టాక్ నెగిటివ్ గా వచ్చిన ఇంపాక్ట్ ఉంటుంది. అలా దెబ్బతిన్న మూవీ నాగశౌర్య రంగబలి. చాలా కాన్ఫిడెన్స్ తో ఈ మూవీ ప్రీమియర్స్ వేశారు. అయితే సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ లో ప్రేక్షకులకి నచ్చిన పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు. లాంగ్ రన్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఏది ఏమైనా కథలో దమ్ముండి, ప్రేక్షకులకి నచ్చుతుందనే నమ్మకం ఉంటె ప్రీమియర్స్ ద్వారా వచ్చే సౌండ్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకురావడంలో చాలా హెల్ప్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.