Begin typing your search above and press return to search.

అప్పుడే బిజీ అయిన క్యూటీ మమితా!

ప్రేమలు సినిమాలో నటించి క్యూట్‌ బ్యూటీ అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ మమితా బైజు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   12 March 2024 7:34 AM GMT
అప్పుడే బిజీ అయిన క్యూటీ మమితా!
X

ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెగ సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాగా రూపొంది కేరళతో పాటు అన్ని భాషల ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించిన చిత్రం 'ప్రేమలు'. తెలుగు లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది.

ప్రేమలు సినిమాలో నటించి క్యూట్‌ బ్యూటీ అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ మమితా బైజు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ అమ్మడు అన్ని భాషల ప్రేక్షకులకు తెగ నచ్చడంతో అన్ని భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం అందుతోంది.

త్వరలోనే ఈ అమ్మడు విష్ణు విశాల్‌ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన విష్ణు విశాల్‌ 21వ సినిమాలో మమిత హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి యొక్క క్రేజ్ తో ఆసినిమాకు మంచి హైప్ క్రియేట్‌ అవుతుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

తమిళంలో ఈమె చేసిన విష్ణు విశాల్‌ మూవీ హిట్ అయితే కచ్చితంగా ముందు ముందు టాలీవుడ్‌ లో కూడా ఈమె సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేరళ కి చెందిన ముద్దుగుమ్మలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. కనుక ఈ అమ్మడి తెలుగు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.