హిట్ లవ్ స్టోరీ సీక్వెల్ లేదట!
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రేమలు' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మలయాళంలో రూపొందిన ప్రేమలు సినిమా అదే టైటిల్‌తో తెలుగులో విడుదల అయ్యి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 11 Jun 2025 6:30 PMగత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రేమలు' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మలయాళంలో రూపొందిన ప్రేమలు సినిమా అదే టైటిల్‌తో తెలుగులో విడుదల అయ్యి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రేమలు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ప్రేమలు సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మధ్య మలయాళ మీడియాల్లో ప్రేమలు సినిమా సీక్వెల్ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. సినిమా సీక్వెల్‌కి కథ రెడీ అవుతుంది అంటూ సదరు మీడియా సంస్థలు తమ కథనంలో పేర్కొన్నాయి.
దర్శకుడు గిరీష్ ఏడీ ప్రస్తుతం ప్రేమలు సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనిలో ఉన్నారు అంటూ మీడియాలో వచ్చిన వార్తలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. యూత్ ఆడియన్స్‌ను మెప్పించిన ప్రేమలు సినిమాకి సీక్వెల్ అంటే కచ్చితంగా మరోసారి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండాలని భావిస్తున్నారని, అందుకు తగ్గట్లుగానే మంచి కథతో ప్రేమలు సీక్వెల్‌ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని జాతీయ మీడియాలో కూడా ఒకటి రెండు కథనాలు వచ్చాయి. తీరా చూస్తే సినిమా సీక్వెల్ లేదని, ప్రస్తుతం ఆ ఆలోచన కూడా లేదు అంటూ నిర్మాత చెప్పడంతో సినీ ప్రేమికులు, ముఖ్యంగా ప్రేమలు సీక్వెల్ చూడాలి అనుకున్న వారు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమలు నిర్మాతల్లో ఒకరు అయిన దిలీష్ పోతన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి తాము ప్రేమలు సినిమా రీమేక్ విషయాన్ని గురించి ఆలోచించడం లేదు. సీక్వెల్ అంటే చాలా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా స్క్రిప్ట్ రెడీ కావడంకు సమయం పట్టవచ్చు. దర్శకుడు ప్రస్తుతం వేరే కమిట్‌మెంట్స్‌తో ఉన్నాడు. ఆ సినిమాల షూటింగ్ పూర్తి అయితే తప్ప కొత్త సినిమాల గురించి ఆలోచించే అవకాశం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రేమలు మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయడం, రిపీట్ చేయడం అంత ఈజీ విషయం కాదు. అందుకే ప్రేమలు సినిమా సీక్వెల్ విషయంలో ఆలోచనలో పడ్డట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు.
నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమలు సినిమాను మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదల చేశారు. అక్కడ సూపర్ హిట్ టాక్ దక్కడంతో దాదాపు నాలుగు వారాల తర్వాత అంటే మార్చి 8న తెలుగులో విడుదల చేశారు. గత ఏడాది తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని ప్రేమలు అందుకుంది. అంతా కొత్త వారితో దర్శకుడు గిరీష్ ఏడీ చేసిన ప్రేమలు సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నేపథ్యంలో సీక్వెల్ ను ప్రేక్షకులు ఆశించడం సబబే. కానీ మేకర్స్‌లోనూ ఆ ఆసక్తి ఉంటేనే సీక్వెల్ సాధ్యం అవుతుంది. ఈ సీక్వెల్ విషయమై దర్శకుడు గిరీష్‌కి ఆసక్తి లేనట్లుగా తెలుస్తోంది.