Begin typing your search above and press return to search.

ఆ ఫేడ్ ఔట్ హీరోకి బిగ్‌ బాస్‌ కలిసి వచ్చేనా?

ప్రేమదేశం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అబ్బాస్ కొంత కాలానికే కనుమరుగయ్యాడు

By:  Tupaki Desk   |   24 Aug 2023 6:04 AM GMT
ఆ ఫేడ్ ఔట్ హీరోకి బిగ్‌ బాస్‌ కలిసి వచ్చేనా?
X

ప్రేమదేశం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అబ్బాస్ కొంత కాలానికే కనుమరుగయ్యాడు. కుటుంబ పోషణ కోసం విదేశాలకు సైతం వెళ్లిన అబ్బాస్ తిరిగి ఇండియా వచ్చాడు. ఈ మధ్య కాలంలో తమిళ మరియు తెలుగు మీడియా లో సందడి చేస్తున్నాడు. వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తూ హడావిడి చేస్తున్నాడు.

ఈ హడావుడి కారణంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. హీరో గా ఇప్పుడు నటించే అవకాశాలు రాకపోవచ్చు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా మంచి ఆఫర్లు రావచ్చు. అందుకే బిగ్‌బాస్ ద్వారా మళ్లీ తాను ఒకడిని ఉన్నాను అంటూ అందరి దృష్టికి రావాలని అబ్బాస్ భావిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మొదటి సినిమా ప్రేమదేశం తర్వాత కొన్ని తెలుగు మరియు ఇతర భాషల సినిమాల్లో నటించిన అబ్బాస్ లక్ కలిసి రాకపోవడంతో హీరోగా కెరీర్ ను కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ తో రీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాలని ఆశ పడుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.. కానీ బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ ను మరో రెండు వారాల్లో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే అబ్బాస్‌ తో నిర్వాహకుల చర్చలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. బిగ్‌ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా అబ్బాస్ కి కెరీర్ పరంగా కలిసి వస్తుందా అనేది చూడాలి. తెలుగు బిగ్ బాస్ లో సందడి చేసిన చాలా మంది పాత స్టార్స్ లేదా కొత్త స్టార్స్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నారు. కనుక అబ్బాస్ కి సెకండ్ ఇన్నింగ్స్ కి బిగ్ బాస్ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది.