డైరెక్టర్ కి స్టార్ హీరో షాకింగ్ సర్ ప్రైజ్!
దీంతో తన డ్రీమ్ కారు ఇప్పట్లో సాధ్యం కాదని ప్రేమ్ కుమార్ కూడ లైట్ తీసుకున్నాడు. ఇదంతా సూర్య గమనించాడు.
By: Tupaki Desk | 11 May 2025 11:57 AM ISTఇండస్ట్రీలో చాలా మందికి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం అంటే ఇష్టం. మార్కెట్ లోకి వచ్చిన కొత్త కార్లతో మోజు తీర్చుకుంటారు. డబ్బులు చేతిలో ఉంటే ఏ కారైనా కొనొచ్చు. పైసా పైసా ఖరీదైన కార్లు కొనడం అంటేనే కష్టంతో కూడిన పని. అలా '96' ఫేమ్ దర్శకుడు ప్రేమ్ కుమార్ వైట్ కలర్ మహీంద్రా థార్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. దాని కోసం అవసరమైన డబ్బు కూడా కూడబె ట్టుకున్నాడు.
మహీంధ్రా థార్ అతడి కలల వాహనం. అదే మోడల్ వైట్ కలర్ కొనాలని వెతకడం మొదలు పెట్టాడు. కానీ ఏ షో రూమ్ లో దొరకలేదు. చివరికి హీరో సూర్య కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాజాను సహాయం కోరాడు. వాళ్లు కూడా కలిసి ప్రయత్నం చేసారు. కానీ మార్కెట్ లో అందుబాటులో లేదు. ఇలా కొంత కాలం గడిచే సరికి కూడబెట్టిన డబ్బు కూడా ఇతర ఖర్చుల రూపంలో అయిపోయింది.
దీంతో తన డ్రీమ్ కారు ఇప్పట్లో సాధ్యం కాదని ప్రేమ్ కుమార్ కూడ లైట్ తీసుకున్నాడు. ఇదంతా సూర్య గమనించాడు. ఓ రోజు సూర్య నుంచి ఓ మెసెజ్ వచ్చింది. అందులో ప్రేమ్ కుమార్ కొనాలనుకున్న వైట్ థార్ ఫోటో ఉంది. చూసి చాలా సంతోషపడ్డాడు. కానీ ఇప్పట్లో థార్ కొనలేని రాజాకి ఫోన్ చేసి చెప్పేసాడు. ఇది అమ్మడానికి కాదు..సూర్య నీకు ఇస్తున్న బహుమతి అన్నాడు. దీంతో ఒక్కసారి ప్రేమ్ కుమార్ నోట మాట రాలేదు.
ప్రేమ్ ఆశ్చర్యపోయాడు. ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా సర్ ప్రైజ్ చేసే సరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్దం కాలేదు. అయితే వైట్ థార్ కొనడానికి సూర్య కూడా చాలా కష్టపడ్డాడు. తన కాంటాక్ట్స్ అన్నీ ఉపయోగిస్తే కానీ సాద్యం కాలేదుట. సూర్య చేతుల మీదు కారు అందుకున్న ప్రేమ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. కారు ను 50 కిలోమీటర్లు నడిపాడు. ఆ క్షణంలో అతడి ఆనందం చెప్పలేనిది.
