టాలీవుడ్ లో మరోసారి కోలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్!
టాలీవుడ్ లో కోలీవుడ్ హీరోలు..డైరెక్టర్లు మమేకమై పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ మంచి అవకాశాలను కల్పిస్తుంది.
By: Tupaki Desk | 8 July 2025 4:00 AM ISTటాలీవుడ్ లో కోలీవుడ్ హీరోలు..డైరెక్టర్లు మమేకమై పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ మంచి అవకాశాలను కల్పిస్తుంది. టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ తో ఇతర భాషల నటులు అంతే ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ మరోసారి టాలీవుడ్ రీ ఎంట్రీకి రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. యంగ్ హీరో శర్వానంద్ తో ఓ క్లాసిక్ లవ్ స్టోరీ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడుట.
ఇటీవలే శర్వాను కలిసి లైన్ వివరించాడుట. నచ్చడంతో శర్వా కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ కథకు శర్వాని ప్రేమ్ కుమార్ ఎంచుకోవడం విశేషం. టాలీవుడ్ లో లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నా శర్వాని ఓ ప్రత్యేక కారణంగా ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది. ఇందులో శర్వా పాత్ర రెండు కోణాల్లో ఉంటుందిట. 'ప్రస్థానం'లో శర్వా సీరియస్ రోల్ - అదే శర్వానంద్ నటించిన గత లవ్ స్టోరీల్లో అతడి పెర్పార్మెన్స్ తాను రాస్తోన్న కథకు పర్పెక్ట్ గా సూటువుతున్నాడుట.
ఆ కారణంగా శర్వాని ఈ ప్రాజెక్ట్ కి తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇదొక క్లాసిక్ లవ్ స్టోరీ అట. ఇందులో శర్వా పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుదంటున్నారు. ప్రేమ్ కుమార్ అంటే క్లాసిక్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు. `96` లాంటి క్లాసిక్ చిత్రం అతడి నుంచే వచ్చిం ది. అదే చిత్రాన్ని శర్వానంద్ తెలుగులో `జాను` టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇక్కడా సినిమా పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత అరవింద్ స్వామి- కార్తీతో హృదయాన్ని హత్తుకునే అనుబంధాల నేపథ్యంలో `సత్యం సుందరం` చేసి మరో బ్లాక్ బస్టర్ అందు కున్నారు.
ప్రస్తుతం '96' సీక్వెల్ పనుల్లో ప్రేమ్ కుమార్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సూర్యతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజుక్ట్ కూడా లాక్ అయింది. అనంతరం శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ పై ప్రేమ్ కుమార్ సీరియస్ గా పనిచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శర్వానంద్ వివిధ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శర్వానంద్ కూడా సరైన సక్సస్ అందుకుని చాలా కాలమవుతోంది. దీంతో అతడు సక్సస్ దాహంలోనే ఉన్నాడు.
