Begin typing your search above and press return to search.

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి ప్రీతి జింతా భ‌ర్త ఏం చేస్తారు?

ప్రీతి 2016లో LAకు చెందిన‌ ఫైనాన్స్ అనలిస్ట్ జీన్ గుడ్‌నఫ్ ని పెళ్లాడారు.

By:  Tupaki Desk   |   19 April 2024 3:15 AM GMT
సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి ప్రీతి జింతా భ‌ర్త ఏం చేస్తారు?
X

సొట్ట బుగ్గ‌ల సుంద‌రి ప్రీతి జింతా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు స‌ర‌స‌న రాజ‌కుమారుడు చిత్రంతో క‌థానాయిక‌గా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత వెంకీ స‌ర‌స‌న `ప్రేమ‌తో రా` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లోను న‌టించింది. కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు.. బిజినెస్ ఉమెన్ కూడా.. నిర్మాత .. IPL జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని కూడా. త‌న‌దైన విజ‌న్ అద్భుత‌ నైపుణ్యంతో జీవితంలో మ‌ల్టీ రోల్స్ ఒంటి చేత్తో నిర్వహిస్తోంది. న‌ట‌న‌ను విర‌మించిన త‌ర్వాత‌ లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చిన ప్రీతి కొంత‌కాలం అక్క‌డే ఉంది. ఇటీవల ముంబైలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఐపీఎల్ లో త‌న టీమ్ ను ఉత్సాహ‌ప‌రుస్తూ స్టాండ్‌లలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ప్రీతి 2016లో LAకు చెందిన‌ ఫైనాన్స్ అనలిస్ట్ జీన్ గుడ్‌నఫ్ ని పెళ్లాడారు. 2021లో సరోగసీ ద్వారా జన్మించిన కవలలు జై - గియా వారి జీవితాల్లో ఆనందం నింపారు. జీన్ లండ‌న్ లో బిజీ.. అందుకే ప్రీతి ఇటు అటూ ప్ర‌యాణాల‌తో క‌నిపిస్తుంద‌ని ముంబై మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

పంజాబ్ కింగ్స్ 2024 ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్‌తో పంజాబ్‌లోని మహారాజా యజ‌వీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో తలపడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రీతి ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలో కొనసాగుతుండగా త‌న‌ జట్టుపైనే కాకుండా జీన్ గూడెనఫ్‌పై కూడా ప్రీతి దృష్టి సారించింది.

జీన్ గుడ్‌నఫ్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని USC మార్షల్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో నైపుణ్యం సాధించడానికి ముందు ఎస్కేడ్ నుండి MBA ప‌ట్టా అందుకున్నాడు. దీనితో సంబంధం లేకుండా ప్రీతి జింతా మాత్రం క్రిమినల్ సైకాలజీలో డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ అయిన Nలైన్ ఎన‌ర్జీ ఐఎన్‌సి లో ప్రొడక్ట్ అండ్ ఫైనాన్స్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న జీన్ గూడెనఫ్ అద్భుతమైన వృత్తిపరమైన నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. Nలైన్ ఎన‌ర్జీ ఐఎన్‌సిలో ప‌ని చేయ‌క‌ ముందు అతడు ఇంటర్‌థింక్స్‌లో వైస్ ప్రెసిడెంట్/డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ .. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వంటి పదవులను నిర్వహించారు.

వైవాహిక జీవితం:

లాస్ ఏంజిల్స్‌లో ప్రీతి జింటా - జీన్ గూడెనఫ్ ప‌రిచ‌యం ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది. ఈ రిలేష‌న్ షిప్ ని చాలా కాలం పాటు ర‌హ‌స్యంగా ఉంచినా కానీ, వారి డేటింగ్ గురించి బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. చివరికి ఈ జంట 28 ఫిబ్రవరి 2016న కుటుంబం, స్నేహితుల స‌మ‌క్షంలో పెళ్లి ప్ర‌మాణాలతో ఒక‌ట‌య్యారు. 2021లో కవలలు జై - గియా జన్మించారు.

ప్రీతి జింటా ఆస్తి సుమారు రూ. 110 కోట్లు. వివిధ మార్గాల్లో పెట్టుబడుల ద్వారా ఇంత‌టి భారీ సంపదను కూడగట్టుకోగా... జీన్ గూడెనఫ్ నికర ఆస్తి విలువ వెల్లడి కాలేదు. ఇటీవల ఈ జంట ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 17.01 కోట్ల రూపాయల విలువైన ఒక విలాసవంతమైన ఇంటిపై పెట్టుబడి పెట్టారు. హై రైజ్‌ నివాస టవర్ లో 11వ అంతస్తులో ఉన్న ఆస్తి 1,474 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అలాగే ఈ జంట హై ఎండ్ లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారు. ఈ జోడీ రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు.. ప్రీతి జింటా IPL ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా ఉన్నారు. 2011లో తన ప్రొడక్షన్ హౌస్ PZNZ మీడియాను స్థాపించారు. వరుసగా Mజాన్సీ సూపర్ లీగ్ .. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లలో స్టెల్లెన్‌బోష్ కింగ్స్ .. సెయింట్ లూసియా కింగ్స్ జట్లకు సహ-యజమానిగా కొన‌సాగుతూ తన క్రీడానుబంధాన్ని మ‌రింత‌గా ధృఢంగా మ‌లుచుకుంది.