Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ వల్ల లైఫ్ తలకిందులైందన్న హీరోయిన్..!

కానీ తన వెనక గుండె బరువెక్కిన బాధ ఉందని ఎప్పుడు తెలియలేదు. 49 ఏళ్ల ప్రీతి జింటా జీవితంలో 13 ఏళ్లకే కష్టాలు ఆమెను పలకరించాయి.

By:  Tupaki Desk   |   1 Feb 2024 3:30 AM GMT
యాక్సిడెంట్ వల్ల లైఫ్ తలకిందులైందన్న హీరోయిన్..!
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో తన టాలెంట్ ఓ మెప్పించిన జింటా బేబీ సౌత్ సినిమాల్లో కూడా మెరిసింది. వెంకటేష్ ప్రేమంటే ఇదేరా.. మహేష్ రాజకుమారుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రీతి తెలుగు లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తన డింపుల్స్ తో బీ టౌన్ ఆడియన్స్ ని ఫిదా చేసిన అమ్మడు అక్కడ స్టార్ స్టేటస్ అందుకుంది.


బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రీతి హీరోయిన్ గా కెరీర్ ముగించింది. ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా అలరించిన ప్రీతి జింటా తెర మీద ఎప్పుడు కనిపించినా సరే అందంగా తన అభినయంతో మెస్మరైజ్ చేసేది. కానీ తన వెనక గుండె బరువెక్కిన బాధ ఉందని ఎప్పుడు తెలియలేదు. 49 ఏళ్ల ప్రీతి జింటా జీవితంలో 13 ఏళ్లకే కష్టాలు ఆమెను పలకరించాయి. 13 ఏళ్ల వయసులోనే కారు ప్రమాదంలో తండ్రిని కోల్పోయింది ప్రీతి జింట.

ఆ యాక్సిడెంట్ లోనే ప్రీతి తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత రెండేళ్లకే ప్రీతి తల్లి కూడా దూరమైంది. 15 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ప్రీతి ఆ టైం లో జీవితం భయంకరంగా నడిచిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఆ బాధ నుంచి బయటకు వచ్చి సినిమాల్లో రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యిందట. అలా ప్రయత్నాలు చేస్తుండగా 1997 లో తారా రంపం సినిమాకు సైన్ చేసింది. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు.

మణిరత్నం డైరెక్ట్ చేసిన దిల్ సే సినిమాతో తెరంగేట్రం చేసింది ప్రీతి జింట. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోకుండా అవకాశాలు వచ్చాయి. ప్రీతి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2016 లో ప్రీతి జీన్ గుడ్ నైఫ్ ని పెళ్లాడింది. అంతకుముందు ఆమె బిజినెస్ మెన్ నెస్ వాడియాతో డేటింగ్ చేసింది. 2008 లోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రీతి అప్పుడప్పుడు క్యామియో రోల్స్ చేసి మెప్పిస్తుంది.