Begin typing your search above and press return to search.

ఆమెపై న‌టుడి భార్య పోలీస్ కేసు!

భోజ్ పురి న‌టుడు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న వేళ నేను రెండ‌వ భార్య‌నంటూ అప‌ర్ణా ఠాకూర్ అనే మ‌హిళ మీడియా ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 2:30 PM GMT
ఆమెపై న‌టుడి భార్య పోలీస్ కేసు!
X

భోజ్ పురి న‌టుడు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న వేళ నేను రెండ‌వ భార్య‌నంటూ అప‌ర్ణా ఠాకూర్ అనే మ‌హిళ మీడియా ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. 1996 లో ర‌వికిష‌న్ తో వివాహం జ‌రిగింద‌ని 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంద‌ని ఆరోపించింది. ఇప్ప‌టికీ ర‌వికిష‌న్ త‌మ రిలేష‌న్ షిప్ లో ఉన్నాడని మీడియా స‌మావేశంలో తెలిపింది. అయితే 15 ఏళ్లు వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ ర‌వికిష‌న్ త‌న‌కు తండ్రి అన్న విష‌యం తెలియ‌ద‌ని..అంకుల్ అని పిలిచేదాన్ని అని..ఆయన కుటుంబాన్ని కూడా తాను క‌లిసాన‌ని... తండ్రిగా త‌న ద‌గ్గ‌ర‌కు ఎప్పుడూ రాలేద‌ని.. త‌న‌ని కుమార్తెగా స్వీక‌రించాల‌ని కోరింది.

ఇది జ‌రిగి మూడు రోజుల‌వుతున్నా ర‌వికిష‌న్ గానీ..ఆయ‌న కుటుంబ స‌భ్యులుగానీ తెర‌పైకి రాక‌పోవ‌డంతో బ్యాకెండ్ లో ఏం జ‌రుగుతుందో అర్దం కాలేదు. ఆయ‌న సైలెంట్ గా ఉండేస‌రికి ఇదంతా నిజ‌మేనా? అన్న ప్ర‌చారం సైతం మొద‌లైంది. తాజాగా ఈ వివాదంపై ర‌వికిష‌న్ భార్య ప్రీతి కిష‌న్ స్పందించారు. అప‌ర్ణా ఠాకూర్ పై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. స‌మాజంలో త‌న భ‌ర్త ప‌రువుప్ర‌తిష్టల‌కు భంగం క‌లిగించాల‌ని..త‌న నుంచి 20 కోట్ల రూపాయ‌లు వ‌సూల్ చేయాల‌ని ఇలాంటి నాట‌కానికి తెర తీసింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

త‌ప్పుడు అత్యాచారం కేసు పేరుతో ర‌వి కిషన్ ని బెదిరిస్తుంద‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. దీంతో పోలీసులు అప‌ర్ణ‌.. కుమార్తె షోనోవా.. కుమారుడు సోన‌క్..భ‌ర్త రాజేష్ ల‌పై కేసు న‌మోదైంది. స‌రిగ్నా ఎన్నిక‌ల

స‌మ‌యంలో ర‌వికిషన్ పై ఇలాంటి వివాదం తెర‌పైకి రావ‌డంతో మీడియాలో వాడే వేడి చ‌ర్చ‌కు తెర‌తీసింది. చివ‌రికి ప్రీతి ఎంట్రీ తో స‌న్నివేశం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

ప్ర‌స్తుతం ర‌వి కిష‌న్ సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ త‌రుపున పోటీ చేసి గెలిచారు. అదే న‌మ్మ‌కంతో ఈసారి అవ‌కాశం ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇత‌ర భాష‌ల కంటే ఎక్కువ‌గా హిందీలోనే సినిమాలు చేస్తున్నారు. `రేసు గుర్రం` త‌ర్వాత తెలుగు లో మ‌ళ్లీ అవ‌కాశాలు రాలేదు. ఆయ‌న చివ‌రిగా టాలీవుడ్ లో `హీరో` అనే చిత్రంలో న‌టించారు.