డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి ఏకైక ఇంజనీర్!
ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `కన్నప్ప` తో వెలుగులోకి వచ్చింది ప్రీతీ ముకుందన్.
By: Tupaki Desk | 13 July 2025 3:00 PM ISTఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `కన్నప్ప` తో వెలుగులోకి వచ్చింది ప్రీతీ ముకుందన్. ఇందులో నెమలి పాత్రలో అమ్మడు ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. నటనతో పాటు అందం.. అభినయంతో అన్నిరకాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచు విష్ణుకు జోడీగా పర్పెక్ట్ గా సెట్ అయింది. మరి ఇందకీ ఈ నెమలి ఎక్కడ నుంచి దిగుమతి అయింది? అమ్మడు బ్యాక్ గ్రాండ్ ఏంటి? అంటే చాలా విషయాలే ఉన్నాయి. తమిళనాడులోని తిరుచ్చిలో పుట్టింది. అమ్మనాన్ని ఇద్దరు డాక్టర్లే.
ఇతర కుటుంబ సభ్యులు కూడా వైద్య రంగంలోనే ఉన్నారు. ఫ్యామిలీ చెన్నైలోనే స్థిరపడింది. అమ్మడు తొలి నుంచి చదువుల తల్లేనట. ఇంట్లో అందరూ డాక్టర్లు కావడంతో తాను ఇంజనీర్ అవ్వాలనుకుందిట. దీనిలో భాగంగా నెమలికి ఎన్ ఐటీ తిరుచ్చిలో సీట్ వచ్చిందిట. అందులో సీట్ రావడం అంటే కేవలం మెరిట్ ఉన్న వారికే వస్తుంది. అలా సీట్ రావడంతో అక్కడే చదువుకుని ఇంజనీర్ పట్టా సంపాదించినట్లు తెలిపింది. భరతనాట్యం ఐదేళ్ల వయసు నుంచే నేర్చుకుందిట.
ఆ తర్వాత హిప్ హాప్, వెస్ట్రన్ డాన్సుల్లో పట్టు సాధించినట్లు తెలిపింది. క్యాంపస్ లో డాన్సుపోటీలు జరిగితే తప్పక పొల్గొనేదాన్ని అంది. మొదటి బహుమతి ఎప్పుడూ తనదేనట. దీంతో నటిగా పరీక్షించుకుందామని కాలేజీ చదువుకుంటోన్న రోజుల్లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టినట్లు తెలిపింది. పలు ప్రకటనలు చేసిన అనంతరం యాక్టింగ్ స్కూల్ లో చేరిందిట. చాలా మంది అమ్మడి తొలి సినిమా `కన్నప్ప` అనుకుంటు న్నారు. కానీ కాదు . కన్నప్ప కంటే ముందే `ఓం భీమ్ భుష్` అనే సినిమాలో నటించింది.
కానీ ఆ సినిమా గురించి ఎవరికీ తెలియకపోవడంతో ప్రీతీ ముకుందన్ వెలుగులోకి రాలేదు. ఆ తర్వాత `కన్నప్ప`లో అవకాశం రావడంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇండస్ట్రీకి వచ్చే క్రమంలో తెలిసిన వారు ఎవరకూ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డట్లు గుర్తు చేసుకుంది. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతుంటే ఇంట్లో అమ్మనాన్నకు చెప్పుకునే ఏడ్చేదాన్ని అని తెలిపింది. వాళ్లు ఇచ్చిన ధైర్యంతోనే నేడు నిలబడగలిగానంది.
