Begin typing your search above and press return to search.

బాలయ్య షో లో ప్రభాస్ మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ అప్‌డేట్‌

అంతే కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ సినిమా ఏంటి అనేది ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 5:31 AM GMT
బాలయ్య షో లో ప్రభాస్ మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ అప్‌డేట్‌
X

ప్రభాస్‌ త్వరలో సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, ఆ తర్వాత నాగ్‌ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే కల్కి సినిమా తో రాబోతున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ సినిమా ఏంటి అనేది ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ముగించిన తర్వాత ప్రభాస్ ముందుగా చేయబోతున్న సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చి చాలా కాలం అయింది. విదేశీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నాం అంటూ ఇప్పటికే దర్శకుడు సందీప్ వంగ చాలా నమ్మకంగా ప్రకటించాడు.

సినిమా ప్రకటించి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు షూటింగ్‌ కూడా ప్రారంభం అవ్వలేదు. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడు అనే విషయమై దర్శకుడు సందీప్ వంగ అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు సందీప్‌ వంగ తాజాగా యానిమల్ సినిమా ను రూపొందించాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో కి హాజరు అయ్యారు.

హీరో రణబీర్‌ కపూర్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న తో పాటు దర్శకుడు సందీప్‌ వంగ కూడా బాలకృష్ణ అన్ స్టాపబుల్‌ షో కి హాజరు అవ్వడం జరిగింది. ఆ సమయంలోనే దర్శకుడు సందీప్ వంగ వచ్చే ఏడాది సెప్టెంబర్‌ లో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేయాల్సి ఉందట.

యానిమల్‌ సినిమా కి పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయింది. వచ్చే వారం లో విడుదల అవ్వబోతున్న యానిమల్‌ సినిమా హిట్ అయితే ప్రభాస్ అభిమానులు స్పిరిట్ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌ లో స్పిరిట్ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయితే విడుదల కావడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

స్పిరిట్ సినిమా లో ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో ప్రభాస్‌ చేస్తున్న సినిమా లన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా స్పిరిట్ ను చేయాలని అభిమానులు దర్శకుడు సందీప్ వంగ ను కోరుతున్నారు.