Begin typing your search above and press return to search.

ప్రతినిధి-2.. రోహిత్ కు మంచి ఛాన్సే

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ప్రతినిధి-2 మూవీ రిలీజ్ కు అంతా సిద్ధమవుతోంది

By:  Tupaki Desk   |   15 April 2024 9:16 AM GMT
ప్రతినిధి-2.. రోహిత్ కు మంచి ఛాన్సే
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ప్రతినిధి-2 మూవీ రిలీజ్ కు అంతా సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రతినిధి-1 కూడా 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదల కావడం విశేషం.

ఆ మధ్య వరుస సినిమాలు చేస్తూ అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైన నారా రోహిత్.. మళ్లీ ప్రతినిధి 2 మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. మూర్తి రచన, దర్శకత్వానికి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో ఈ సినిమా మంచి హిట్ అవుద్దని మూవీ టీమ్ అంతా భావిస్తోంది.

అయితే ఈ మూవీ రిలీజ్ ను సరైన తేదీకి చేస్తున్నారని సినీ పండితులు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆ సమయంలో పెద్దగా పోటీ లేదని, సరైన రీతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తే మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని అంటున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే మూవీ దూసుకుపోవడం పక్కా అని అంచనా వేస్తున్నారు. డీజే టిల్లు తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడలేదని, మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.

ప్రతినిధి రిలీజ్ రోజే దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా థియేటర్లు ఖాళీ అవుతాయి. కాబట్టి ప్రతినిధి-2కి సాలిడ్ థియేటర్లు దొరుకుతాయి. ఆ తర్వాత రోజు రెండు డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. విశాల్ రత్నంతోపాటు పాటు తమన్నా, రాశిఖన్నా బాక్ చిత్రాలు విడుదల అవ్వనున్నాయి. వీటికి మంచి టాక్ వస్తే తప్ప ఆడియన్స్ థియేటర్లకు వెళ్లరు.

కాబట్టి ప్రతినిధి-2కు మంచి ఛాన్సే వచ్చిందని చెప్పాలి. దానికి తోడు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ తోపాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుత రాజకీయాల ఆధారంగా ఈ మూవీ ఉండనున్నట్లు అర్ధమవుతోంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే విడుదల అవుతుండడం మరో ప్లస్ పాయింట్. మరి ఈ సినిమాతో నారా రోహిత్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.