Begin typing your search above and press return to search.

ప్రతినిధి 2.. ఫస్ట్ లుక్కుతోనే థ్రిల్ ఇచ్చిన నారా రోహిత్

గతంలో కంటెంట్ పరంగా మంచి క్రేజ్ అందుకున్న పొలిటికల్ థ్రిల్లర్

By:  Tupaki Desk   |   24 July 2023 11:37 AM GMT
ప్రతినిధి 2.. ఫస్ట్ లుక్కుతోనే థ్రిల్ ఇచ్చిన నారా రోహిత్
X

నారా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పడింది. అందరు అనుకున్నట్లు నారా రోహిత్ తన కొత్త సినిమా వివరాలపై క్లారిటీ ఇచ్చేశారు. గతంలో కంటెంట్ పరంగా మంచి క్రేజ్ అందుకున్న పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్ గా 'ప్రతినిధి 2'తో రాబోతున్నట్లు మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అన్ని దుష్టశక్తులను ఎదురించేందుకు ఒకడు నిలబడతాడు అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

గతంలో 'ప్రతినిథి' సినిమా మంచి కథ, గ్రిప్పింగ్ కథనం ఉండటం వల్ల విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. 2014లో విడుదలై ఈ చిత్రంలో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే ఓ బాధ్యతాయుతమైన యువకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రశాంత్ మండవ దీనికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ గానూ ఇది బాగానే ఆడింది. హీరోకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇప్పుడు తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ ను చూస్తుంటే అదే సినిమా ఆసక్తి కలుగుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. తాను ప్రశ్నించేందుకు ఉన్నట్టుగా కనిపించారు. ఇంకా ఆయన తలపై భాగం నుంచి మొత్తం శరీరం ప్రతిదీ వార్తాపత్రికలతో కప్పిఉన్నట్లుగా చూపించారు. అంటే ఈ చిత్రం పక్కాగా సామాజిక అంశం ఇతివృత్తంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి టీవీ 5 మూర్తి దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సినిమా నిర్మించనున్నారు. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్. రవితేజ గిరిజాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాను 2024 జనవరి 25 రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. త్వరలోనే కథానాయిక, ఇతర నటీనటుల వివరాలను తెలియజేయనున్నారు.

కాగా, నారా రోహిత్ కెరీర్ ప్రారంభం 'బాణం' సినిమా నుంచి ఇలాంటి డిఫెరంట్ కాన్సెప్ట్ కథలతోనే హీరోగా రాణించారు. 'సోలో', 'తుంటరి', 'సావిత్రి', 'రాజా చెయ్యి వేస్తే', 'జ్యో అచ్యుతానంద', 'శంకర', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'శమంతకమణి', 'కథలో రాజకుమారి', 'బాలకృష్ణుడు'.. ఇలా మొత్తంగా 18 చిత్రాలు చేశారు. చివరిగా 2018లో వీరభోగ వసంత రాయలు చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఎట్టకేలకు ఈ ప్రతినిధి 2తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.