నటుడి భార్య- ప్రియురాలి మధ్య సెట్టవ్వక
బాలీవుడ్ లో ఏ గడపను టచ్ చేసినా, అక్కడ రెండు కథలు ఉన్నాయి. ఒకటి మొదటి భార్య కథ.
By: Tupaki Desk | 15 May 2025 9:12 AM ISTబాలీవుడ్ లో ఏ గడపను టచ్ చేసినా, అక్కడ రెండు కథలు ఉన్నాయి. ఒకటి మొదటి భార్య కథ. మరొకటి రెండో భార్య కథ. భార్య ఉండగానే ప్రియురాలితో సయ్యాటలు అక్కడ చాలా కామన్. అలాంటి సయ్యాట కారణంగా నలిగిపోయిన ఒక యువనటుడి కథలో ఈ ట్విస్టు అందరినీ ఆశ్చర్యపరిచింది.
అతడు ఇటీవలే తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లికి తన తండ్రిని, అతడి కుటుంబాన్ని పిలవలేదు. తాను ఒంటరి తల్లితో పెరిగానని, అందువల్ల తన తల్లి ఇంట్లో జరిగిన పెళ్లికి తండ్రిని ఆహ్వానించలేకపోయానని తెలిపాడు. పైగా తన తల్లితో తన తండ్రి ప్రస్తుత భార్యకు, ఆమె పిల్లలకు సరిపడదు. అందువల్ల కూడా నేను నాన్నను పెళ్లికి ఆహ్వానించలేదు అని తెలిపాడు.
ప్రజలు ఇలాంటి విషయాలలో త్వరగా తీర్పులు చెప్పేస్తారని, తన ఇబ్బందిని కూడా గమనించాలని అతడు కోరాడు. ఆ హీరో ఎవరో కాదు.. ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్ కుమారుడు, యువనటుడు ప్రతీక్ బబ్బర్. అతడు తన ప్రియురాలు, నటి ప్రియా బెనర్జీని ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లాడాడు. అయితే తన తండ్రి, ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్, సవతి తోబుట్టువులు ఆర్య బబ్బర్, జూహి బబ్బర్ ఈ వేడుకకు హాజరు కాకపోవడం చర్చగా మారింది.
తన దివంగత తల్లి స్మితా పాటిల్ ఇంట్లో వివాహం జరిగినందున, రాజ్ బబ్బర్ భార్య నాదిర, స్మితా పాటిల్ మధ్య ఉన్న గత గొడవల కారణంగా తన తండ్రి కుటుంబాన్ని ఆహ్వానించడం సరైనది కాదు! అని భావించానని ప్రతీక్ చెప్పారు. నా తండ్రి భార్య, నా తల్లికి గతంలో కొన్ని సమస్యలు ఉండేవి. 30-40 ఏళ్ల నాటి పత్రికల్లో అలాంటి కథనాలెన్నో మీరు చదివారు. పెళ్లికి పిలవలేదు అంటే ఇప్పుడు కలతలు ఉన్నాయని కాదు. అమ్మను గౌరవించేందుకు నేను అలా చేసాను. నా తండ్రి, ఆయన కుటుంబంతో కలిసి ఏదైనా ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. అని ప్రతీక్ వివరణ ఇచ్చాడు. నటి ప్రియా బెనర్జీ ఇంతకుముందు టాలీవుడ్ నటుడు అడివి శేష్ సరసన కిస్ అనే చిత్రంలో నటించారు.