Begin typing your search above and press return to search.

జై హనుమాన్... ఆసక్తికర ప్రకటన!

చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   23 April 2024 4:30 AM GMT
జై హనుమాన్... ఆసక్తికర ప్రకటన!
X

టాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ రూపొందుతున్నాయి. స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సీక్వెల్‌ పుష్ప 2 పై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అదే స్థాయిలో హనుమాన్ సినిమా సీక్వెల్‌ జై హనుమాన్‌ పై కూడా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. 25 సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ హైదరాబాద్‌ లోని ఓ మల్టీప్లెక్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం నేడు హనుమాన్‌ జయంతి సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కి సంబంధించిన పలు విషయాలను మీడియా ముందు అధికారికంగా వెళ్లడించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది.

హనుమాన్‌ వంద రోజుల వేడుక ఒక వైపు, జై హనుమాన్ సినిమా అప్‌డేట్స్ మరో వైపు తో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సినీ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. జై హనుమాన్ సినిమా గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో దర్శకుడి మీడియా సమావేశంపై ఆసక్తి నెలకొంది.

హనుమాన్ వంటి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అంతకు మించి అన్నట్లుగా జై హనుమాన్ సినిమా ను రూపొందించబోతున్నాడు. అందుకోసం బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ తో వర్క్‌ చేయబోతున్నాడని సమాచారం అందుతోంది. అన్ని విషయాలపై అతి త్వరలో ప్రశాంత్‌ వర్మ నుంచి ఆసక్తికర ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.