Begin typing your search above and press return to search.

సలార్ దర్శకుడి ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ ఎవరో తెలుసా?

తాజాగా ప్రశాంత్‌ నీల్ తన ఉగ్రమ్‌ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ విషయాలను నెమరువేసుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 1:16 PM GMT
సలార్ దర్శకుడి ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ ఎవరో తెలుసా?
X

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌ తో ఒక్కసారిగా స్టార్‌ స్టేటస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. పాన్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ గత ఏడాది చివర్లో సలార్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ప్రభాస్ తో ప్రశాంత్‌ నీల్ రూపొందించిన సలార్‌ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

సలార్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే సలార్ 2 ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా ప్రశాంత్‌ నీల్ తన ఉగ్రమ్‌ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ విషయాలను నెమరువేసుకున్నారు.

ఆ చిట్ చాట్ లో ప్రశాంత్ నీల్ తన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ డైరెక్టర్‌, హీరో మరియు హీరోయిన్‌ పేరును చెప్పాడు. నాకు ఉపేంద్ర దర్శకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వం చాలా బాగుంటుందని అన్నాడు. ఇది కన్నడ షో కనుక ఉపేంద్ర సర్ పేరు చెప్పడం లేదు. ఏ భాష కార్యక్రమం అయినా కూడా నేను ఉపేంద్ర సర్ పేరు చెప్పే వాడిని అన్నాడు.

ఇక నాకు చినప్పటి నుంచి కూడా అమితాబచ్చన్‌ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అన్నట్లుగా ప్రశాంత్‌ నీల్ చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్స్‌ లో శ్రీదేవి నాకు ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌. ఆమె కు నేను ఎప్పటికి కూడా అభిమానిగా ఉంటాను అన్నట్లుగా ప్రశాంత్ నీల్‌ చెప్పుకొచ్చాడు.

ఉగ్రమ్‌ సినిమా తన సినీ కెరీర్‌ ను మలుపు తిప్పిందని, ఆ సినిమా కు అప్పుడే పదేళ్లు పూర్తి అయ్యాయి అంటే చాలా షాకింగ్ గా ఉంది అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన సలార్‌ 2 సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్నట్లుగా పేర్కొన్నాడు. సలార్‌ 2 తర్వాత ఎన్టీఆర్‌ తో ప్రశాంత్ నీల్‌ మూవీ ఉండబోతున్న విషయం తెల్సిందే.