Begin typing your search above and press return to search.

సంక్రాంతి పోటీ.. ప్రశాంత్ వర్మ వ్వాటే విష్

సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. ఇప్పటికే యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీలు రిలీజైపోయాయి.

By:  Tupaki Desk   |   12 Jan 2024 8:56 AM GMT
సంక్రాంతి పోటీ.. ప్రశాంత్ వర్మ వ్వాటే విష్
X

సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. ఇప్పటికే యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీలు రిలీజైపోయాయి. విక్టరీ వెంకటేశ్ సైంధవ్, కింగ్ నాగార్జున నా సామి రంగ చిత్రాలు విడుదలకు సిద్ధమైపోయాయి. సూపర్ హీరో యూనివర్స్ లో ఫస్ట్ సినిమా అయినా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

హనుమాన్ లో ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయంటూ అటు సినీ ప్రియులు, ఇటు నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీలో డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ అన్ని అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. హనుమాన్ మూవీకి వీఎఫ్ఎక్స్ పెద్ద బలమని నెటిజన్లు అంటున్నారు. ప్రశాంత్ వర్మ టాలెంట్ వేరే లెవల్ అని కొనియాడుతున్నారు.

ఇక హనుమాన్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ తాాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతోపాటు నలుగురు సంక్రాంతి హీరోలు ఉన్న స్పెషల్ పోస్టర్ ను షేర్ చేశారు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. వర్త్ మామ వర్త్ అంటూ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు. నువ్వు పెద్ద హిట్ కొట్టేశావ్ అన్నా, బ్లాక్ బస్టర్ సాధించావ్ బ్రో, మా బంగారం నువ్వే భయ్యా, చెప్పినట్లు హిట్ కొట్టావ్ గా, నీ సైకిల్ బాగా స్ట్రాంగ్ అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

సినిమా విషయానికొస్తే.. రూ.25 కోట్ల అతి తక్కువ బడ్డెట్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతం సృష్టించారు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ అందించారు. ఇక ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోవడం పక్కా.