Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ బాలీవుడ్ కాంబో గురించి ఇది విన్నారా?

బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ప్రస్తుతం సౌత్ ఇండియా డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   16 April 2024 4:28 AM GMT
ప్రశాంత్ వర్మ బాలీవుడ్ కాంబో  గురించి ఇది విన్నారా?
X

బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ప్రస్తుతం సౌత్ ఇండియా డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా, కబీర్ సింగ్ సినిమాలతో బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యాడు. అట్లీ జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఒక సినిమాని ఎనౌన్స్ చేశారు.

ఏఆర్ మురుగదాస్ తో సికందర్ అనే సినిమాని సల్మాన్ ఖాన్ ఎనౌన్స్ చేశారు. మలయాళీ డైరెక్టర్స్ కూడా హిందీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కూడా బాలీవుడ్ లో బడా ప్రొడక్షన్ కంపెనీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మూవీని కంప్లీట్ చేసే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నారు. ఈ యువ దర్శకుడు సినిమాటిక్ యూనివర్స్ నుంచి 10 ఇండియన్ సూపర్ హీరో చిత్రాలు వస్తాయని ఇదివరకే ప్రకటించాడు. దీనిలో జై హనుమాన్ రెండో మూవీగా సిద్ధం అవుతోంది. అధీరా అనే సినిమాని కూడా ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు.

సూపర్ విమెన్ స్టోరీ ఒకటి చేయబోతున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయనున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా బిటౌన్ లో ఈ న్యూస్ జోరుగా ప్రచారంలో ఉంది. మైథలాజికల్ యాక్షన్ డ్రామా కథని ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ కి ఇప్పటికే నేరేట్ చేసాడని, త్వరలో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందనే టాక్ నడుస్తోంది.

అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. ప్రస్తుతం రణవీర్ సింగ్ డాన్ 3 మూవీలో చేస్తున్నాడు. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో మరో సినిమా రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రశాంత్ వర్మ కథ విన్నప్పటికి ఫైనల్ కాల్ అయితే ఇవ్వలేదు.

ప్రస్తుతం ఆ దర్శకుడు జై హనుమాన్ కంప్లీట్ చేయడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత అతని నెక్స్ట్ మూవీ ఏంటనేది తెలిసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ రావడం అనేది వాస్తవమే అయిన రణవీర్ సింగ్ తో మూవీ ఓకే అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.