Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ వ‌ర్మ 'బ్ర‌హ్మ‌రాక్ష‌స‌'.. పెద్ద ప్లాన్ వేశారుగా!

ఇక బ్ర‌హ్మ‌రాక్ష‌స‌ సినిమాను లేట్ చేయకుండా వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 May 2024 12:50 PM GMT
ప్ర‌శాంత్ వ‌ర్మ బ్ర‌హ్మ‌రాక్ష‌స‌.. పెద్ద ప్లాన్ వేశారుగా!
X

'హ‌నుమాన్‌' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్ర‌శాంత్ వ‌ర్మ తన తదుపరి ప్రాజెక్ట్ పై భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్‌ తరువాత, ఆయన బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్‌తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రానికి 'బ్ర‌హ్మ‌రాక్ష‌స‌' అనే టైటిల్ కూడా నిర్ణయించారు.

హనుమాన్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ రాబోయే రోజుల్లో మల్టివర్స్ కథలతో మరిన్నీ సినిమాలు రానున్నట్లు చెప్పాడు. దీంతో ఆడియెన్స్ లో అతని బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక బ్ర‌హ్మ‌రాక్ష‌స‌ సినిమాను లేట్ చేయకుండా వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

హైద‌రాబాద్ శివార్ల‌లోని సెట్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇదే సెట్‌ను ముందుగా 'హ‌నుమాన్‌' కోసం నిర్మించారు. 'బ్ర‌హ్మ‌రాక్ష‌స‌' చిత్రానికి సంబంధించిన ప్రాథమిక దృశ్యాలను చిత్రీకరించేందుకు టీమ్ ఈ సెట్‌ను ఉపయోగిస్తోంది. ఈ ప్రాథమిక చిత్రీకరణ గ్లింప్స్ కోసం మాత్రమే సాగుతుందని సమాచారం. ర‌ణ‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగు రోజుల సమయం కేటాయించారు.

ఇక ఈ గ్లింప్స్‌ను ప్రేక్షకులకు చూపించి సినిమాపై ఆసక్తిని పెంచాలని చిత్రబృందం భావిస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్నీ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శకత్వంలో, ర‌ణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే 'హనుమాన్' వంటి విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్ర‌శాంత్ వ‌ర్మ, 'బ్ర‌హ్మ‌రాక్ష‌స‌' తో మరింత భిన్నమైన కథాంశంతో ముందుకు రావాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు బాలీవుడ్ లో కూడా మారుమ్రోగి పోవడం పక్కా అని తెలుస్తోంది.

హనుమన్ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో కూడా అతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. బడా నిర్మాతలు కూడా అడ్వాన్సులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం సరైన స్క్రిప్ట్ లేనిదే ఏ నిర్మాతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే అతను ఎక్కువ స్థాయిలో మల్టివర్స్ కథలను తెరపైకి తీసుకురావాలని అడుగులు వేస్తూ ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో ప్రశాంత్ వర్మ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.