Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ.. అక్కడేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు?

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఏకంగా 10 సూపర్ హీరో కథలని తెరకెక్కిస్తా అని ప్రకటించాడు.

By:  Tupaki Desk   |   5 March 2024 4:56 AM GMT
ప్రశాంత్ వర్మ.. అక్కడేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు?
X

హనుమాన్ సినిమాతో దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ఆ!, ఆ తరువాత కల్కితో మంచి విషయం ఉన్న దర్శకుడు అని ప్రశాంత్ ప్రూవ్ చేసుకున్నాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఊహించని ఎలిమెంట్స్ తో కథని చెప్పడం ప్రశాంత్ వర్మ స్టైల్. తాను కమర్షియల్ యాక్షన్ మూవీస్ కూడా చేయగలను అను హనుమాన్ తో నిరూపించుకున్నాడు.

సౌత్ లో ఈ జెనరేషన్ లో వచ్చిన సూపర్ హీరో చిత్రంగా హనుమాన్ నిలిచింది. తేజా సజ్జా ఈ మూవీతో స్టార్ అయిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల కలెక్షన్స్ ని హనుమాన్ సొంతం చేసుకుంది. నార్త్ ఇండియాలో హనుమాన్ చిత్రాన్ని బాగా ఆదరించారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ పై ఫోకస్ చేశారు.

జై హనుమాన్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. స్టార్ హీరో ఈ చిత్రంలో హనుమాన్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని ప్రశాంత్ వర్మ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. అయితే ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఓ బాలీవుడ్ స్టార్ హీరోని కూడా తన సినిమాటిక్ యూనివర్స్ కథల కోసం లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఏకంగా 10 సూపర్ హీరో కథలని తెరకెక్కిస్తా అని ప్రకటించాడు. అందుకు తగ్గట్లుగానే హనుమాన్ తో సక్సెస్ కొట్టి ఇప్పుడు జై హనుమాన్ చేయబోతున్నాడు. నెక్స్ట్ అధీరా ఒకటి లైన్ లో ఉంది. అలాగే సూపర్ విమెన్ క్యారెక్టర్ తో ఒక సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలో ఒక స్టార్ హీరోతో మూవీ ప్లాన్ చేయబోతున్నాడంట.

త్వరలో అతనికి కథ నేరేట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. త్వరలో దీనికి సంబందించిన ప్రకటన ఉండొచ్చు అనే ప్రచారం నడుస్తోంది. ఒక వేళ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లోకి అడుగుపెడితే కచ్చితంగా అక్కడ కూడా వండర్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.