Begin typing your search above and press return to search.

సలార్: ఆ సినిమాతో పోలికలు… ఫ్యాన్స్ టెన్షన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ సలార్

By:  Tupaki Desk   |   3 Dec 2023 4:28 AM GMT
సలార్: ఆ సినిమాతో పోలికలు… ఫ్యాన్స్ టెన్షన్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ మూవీ నుంచి సీజ్ ఫైర్ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ప్రశాంత్ నీల్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని అన్ని భాషలలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ లెవల్ ఫీస్ట్ గా ఉందని ఫ్యాన్స్ కితాబు ఇస్తున్నారు. యాక్షన్ ని ఎక్స్ట్రీమ్ లెవల్ లో సలార్ మూవీలో ఆవిష్కరించారని కొనియాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఇంకో కొత్త టెన్షన్ వచ్చిపడింది. ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం. ఈ సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది.

అలాగే ఇందులో మాఫియాలో ఉన్న ఫ్రెండ్ కోసం ఎంతకైనా తెగించే మెకానిక్ ఫ్రెండ్ పాత్రలో శ్రీమురళీ నటించాడు. ఇప్పుడు సలార్ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ చేసిన దేవా పాత్ర కూడా అదే తరహాలో ఉంది. తన స్నేహితుడు కోసం ఎంతవరకైనా వెళ్ళే వ్యక్తిగా, మెకానిక్ గా ఆవిష్కరించారు. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ సలార్ ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం తరహాలోనే ఉంటుందని అన్నారు.

దీంతో ఉగ్రం మూవీని రీమేక్ చేస్తున్నారనే ప్రచారం నడిచింది. దీనిని ప్రశాంత్ నీల్ ఖండించారు. కాని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే ఉగ్రం మూవీని గ్రాండ్ స్కేల్ పై మళ్ళీ ప్రశాంత్ నీల్ రీమేక్ చేసాడా అనే డౌట్ వస్తోంది. అదే జరిగితే సలార్ కి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అయితే కొన్ని పోలికలు ఉన్నా కూడా సలార్ ని రెండు భాగాలుగా వస్తుండటంతో కచ్చితంగా మార్పులు చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఉగ్రం సినిమాలోని బేసిక్ లైన్ తీసుకొని మరో కొత్త ప్రపంచాన్ని, కొత్త కథని సలార్ కోసం ప్రశాంత్ నీల్ డిజైన్ చేసి ఉంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఉగ్రం మూవీ ఇప్పటికే కన్నడంలో వచ్చి ఉండటంతో దానినే మళ్ళీ గ్రాండ్ గా రీమేక్ చేసి ఉంటే మాత్రం కచ్చితంగా ఎంతో కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది.

మరి ఈ విషయంలో ప్రశాంత్ నీల్ డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కి ముందు మరల సెకండ్ ట్రైలర్ ని కూడా ప్రభాస్ మీద కంప్లీట్ గా కట్ చేసే ప్రెజెంట్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారంట. అదే జరిగితే అప్పుడు ఫ్యాన్స్ కి ఉన్న సందేహాలు అన్నింటికి క్లారిటీ ఇచ్చేసే అవకాశం ఉంది.