Begin typing your search above and press return to search.

నీల్.. కోట్ల మంది ప్రశ్నకు ఆన్సర్ ఎప్పుడో?

అయితే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీపై ఎప్పటి నుంచో అందరి దృష్టి నెలకొంది. ఆయన చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి

By:  Tupaki Desk   |   22 March 2024 11:30 PM GMT
నీల్.. కోట్ల మంది ప్రశ్నకు ఆన్సర్ ఎప్పుడో?
X

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. కేజీఎఫ్ రెండు పార్టులతో సినీ ప్రియుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేశారు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని పెద్ద స్టార్ హీరోలు, నిర్మాతలు పోటీపడుతున్నారు!

అయితే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీపై ఎప్పటి నుంచో అందరి దృష్టి నెలకొంది. ఆయన చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి సలార్-2 కాగా.. మరొకటి NTR 31. సలార్ షూటింగ్ సమయంలోనే తన నెక్స్ట్ మూవీ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతోందని ప్రకటించారు నీల్. వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో సలార్ తర్వాత తారక్ మూవీ పట్టాలెక్కుతుందని అంతా ఊహించారు.

కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 మూవీలో నటించనున్నారు. వచ్చే నెలలో వార్-2 షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ నీల్- తారక్ మూవీ లేట్ అవుద్దని వార్తలు వస్తున్నాయి. కానీ NTR 31 మేకర్స్.. మాత్రం ఈ సినిమా వేసవిలోనే మొదలవుతుందని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్.. వార్-2 సెట్స్ లోకి ముందు అడుగు పెడతారా లేక NTR 31 సెట్సా అనేది సస్పెన్స్ గా మారింది.

మరోవైపు, సలార్ పార్ట్-1 లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ పార్ట్ మీద మరింత ఆసక్తి నెలకొల్పారు ప్రశాంత్ నీల్. సలార్ పార్ట్-2 టైటిల్ ను శౌర్యాంగ పర్వంగా రివీల్ కూడా చేశారు. సలార్ 2 షూటింగ్ ఏప్రిల్‌ లోనే ప్రారంభం కానుందని ఆ మూవీ యాక్టర్లు పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు పలువురు నటులు చెబుతున్నారు. హోంబలే ఫిల్మ్స్ కూడా అదే చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్.. కల్కి మూవీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత రాజా సాబ్ లో నటించనున్నారు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇవన్నీ చూస్తుంటే.. ప్రశాంత్ నీల్ తన రెండు ప్రాజెక్టుల్లో ఏది ముందు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారనేది కన్ఫ్యూజన్ గా మారింది. ఓవైపు, ఇద్దరు హీరోలు తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు, సలార్-2, NTR 31 మేకర్స్ సమ్మర్ లోనే తమ చిత్రాల షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రకటన కోసమే అంతా వేచి చూస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?