Begin typing your search above and press return to search.

త‌ళా అజిత్‌తో ప్ర‌శాంత్ నీల్- మైత్రి?

స‌లార్ సాధించిన ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ ప్రభాస్ తో 'స‌లార్ 2' తెర‌కెక్కిస్తార‌ని అంతా భావిస్తున్నారు

By:  Tupaki Desk   |   25 Dec 2023 4:52 AM GMT
త‌ళా అజిత్‌తో ప్ర‌శాంత్ నీల్- మైత్రి?
X

కేజీఎఫ్‌-కేజీఎఫ్ 2- స‌లార్ .. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూకుడుమీదున్నాడు ప్ర‌శాంత్ నీల్. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఎలానో క‌న్న‌డ ద‌ర్శ‌కుడు నీల్ పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అత‌డి త‌దుప‌రి హీరో ఎవ‌రు? అన్నది హాట్ టాపిక్ గా మారుతోంది.

ప్ర‌శాంత్ నీల్ కోసం ప్ర‌ముఖ హీరోలంతా వేచి చూస్తున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్, ఎన్టీఆర్ లాంటి పాపుల‌ర్ హీరోలు ఉన్నారు. వీళ్లంద‌రికీ నీల్ మాటిచ్చాడు. కానీ ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు.

స‌లార్ సాధించిన ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ ప్రభాస్ తో 'స‌లార్ 2' తెర‌కెక్కిస్తార‌ని అంతా భావిస్తున్నారు. కేజీఎఫ్ పాన్ ఇండియా స‌క్సెస్ సాధించిన వెంట‌నే అత‌డు మ‌రో మాట లేకుండా కేజీఎఫ్ 2ని తెర‌కెక్కించి 1000 కోట్ల క్ల‌బ్ ని సాధించాడు. ఇప్పుడు స‌లార్ సీక్వెల్ తోను అలాంటి ఫీట్ ని రిపీట్ చేస్తాడ‌నే అంచ‌నా వేస్తున్నారు.

అయితే ఇంత‌లోనే ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్ లిస్ట్ లోకి మ‌రో హీరో వ‌చ్చి చేరాడు. అత‌డు సౌతిండియాలో అసాధార‌ణ మాస్ ఫాలోయింగ్ ఉన్న త‌ళా అజిత్ కావ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అజిత్ స్వ‌యంగా ప్ర‌శాంత్ నీల్ ని త‌న‌తో ఓ సినిమా చేయాల‌ని కోరార‌ని, దీంతో నీల్ ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే అజిత్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ మరో సంచ‌ల‌నానికి తెర తీస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే అజిత్ న‌టించే 65వ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ తెర‌కెక్కిస్తుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ సినిమాకి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ప్ర‌శాంత్ నీల్ - ఎన్టీఆర్ చిత్రానికి మైత్రి మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే అడ్వాన్సులు ఇచ్చి ఉంది. కానీ అంత‌కంటే ముందే అజిత్ తో ప్ర‌శాంత్ నీల్ ని క‌లిపి మైత్రి సంస్థ బిగ్ ప్లాన్ చేస్తోందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాజా వార్త‌ల్ని అధికారికంగా మైత్రి సంస్థ ధృవీక‌రించ‌లేదు. మైత్రినే స్వ‌యంగా స్ప‌ష్ఠ‌త నిస్తుందేమో చూడాలి.