Begin typing your search above and press return to search.

ఖాన్ - ఆక్వామాన్.. రెండోసారి నీల్ దెబ్బ

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కించిన 'సలార్' మూవీ నేడు(డిసెంబర్ 22) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Dec 2023 9:50 AM GMT
ఖాన్ - ఆక్వామాన్.. రెండోసారి నీల్ దెబ్బ
X

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కించిన 'సలార్' మూవీ నేడు(డిసెంబర్ 22) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF కూడా సేమ్ ఇదే రోజున రిలీజ్ అయింది. అంతేకాదు అప్పుడు KGF రిలీజ్ అయిన రోజే హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన 'జీరో' సినిమా విడుదలైంది. అలాగే ఇప్పుడు సలార్ రిలీజ్ అయిన సమయంలో షారుక్ ఖాన్ నటించిన 'డంకీ' కూడా థియేటర్స్ లోకి వచ్చింది.

KGF మూవీ 2018 డిసెంబర్ 21న రిలీజ్ అయింది. అదేరోజు షారుక్ ఖాన్ 'జీరో' మూవీ రిలీజ్ అవ్వగా జీరో మూవీ ప్లాప్ అవడంతో ఆ రిజల్ట్ తో షారుక్ ఏకంగా ఐదేళ్లపాటు సినిమాలు చేయలేదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అదే 2018 డిసెంబర్ 21న మరో హాలీవుడ్ మూవీ 'ఆక్వా మ్యాన్' కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. కట్ చేస్తే, సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే హిస్టరీ రిపీట్ అయింది. ప్రశాంత్ నీల్ షారుక్ కి ఆపోజిట్ గా 'సలార్' ని రిలీజ్ చేశాడు.

డిసెంబర్ 21న డంకి మూవీ రిలీజ్ అవ్వగా అప్పట్లో జీరో మూవీ ఎలాంటి నెగటివ్ టాక్ సొంతం చేసుకుందో ఇప్పుడు 'డంకీ' కూడా నెగిటివ్ టాక్ అందుకుంది. వర వైపు హాలీవుడ్ నుంచి కూడా 'ఆక్వామాన్ 2' థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈసారి ఈ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఐదేళ్ల క్రితం జరిగిన బాక్స్ ఆఫీస్ వార్ లో కేజిఎఫ్ మూవీతో విన్నర్ గా నిలిచిన ప్రశాంత్ నీళ్ మళ్లీ ఇప్పుడు అదే హిస్టరీని రిపీట్ చేశాడు.

డంకీ, ఆక్వామాన్ 2 కంటే సలార్ మూవీకే ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. దాంతో ఈసారి కూడా ప్రశాంత్ నీల్ సలార్ తో బాక్సాఫీస్ విన్నర్ గా నిలవడం గ్యారెంటీ అని చెబుతున్నారు. కాకపోతే 2018 లో వచ్చిన KGF మూవీలో హీరో యశ్ అయితే ఇప్పుడు సలార్ లో ప్రభాస్. దానికి తోడు జీరో సమయంలో షారుక్ వరుస ప్లాప్స్ తో ఉన్నాడు. కానీ ఈసారి అలా కాదు.

డంకీ కంటే ముందు పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కొల్లగొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ప్రశాంత్ నీల్ సలార్ తో షారుక్ ఖాన్ కి భారీ షాక్ ఇచ్చాడు. ప్రజెంట్ నార్త్ లో డంకీ కంటే సలార్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అలాగే ఓవర్సీస్ లో కొన్ని సెంటర్స్ లో సలార్ 'ఆక్వామెన్ 2' కి షాక్ ఇస్తుంది. వీటన్నింటిని బట్టి చూస్తే ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమాదే పైచేయి అని చెప్పొచ్చు. నిజంగా ఇది బిగ్ కోయిన్సీడెన్స్ అని చెప్పాలి.