Begin typing your search above and press return to search.

'సలార్‌ 2' అనుమానాలు... సమాధానాలు!

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 July 2025 11:00 PM IST
సలార్‌ 2 అనుమానాలు... సమాధానాలు!
X

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సలార్‌ వచ్చిన వెంటనే సలార్‌ 2 సైతం వస్తుందని మేకర్స్ స్వయంగా చెప్పారు. కానీ రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు సలార్‌ 2 విషయమై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నోరు మెదపడం లేదు. సలార్‌ 2 సినిమాలో అసలైన కంటెంట్‌ ఉంటుందని, సినిమా కథ మొత్తం అందులోనే ఉంటుందని మేకర్స్ చెబుతూ వచ్చారు. మొదటి పార్ట్‌ చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలో మిగిలి పోయిన ప్రశ్నలకు రెండో పార్ట్‌లో సమాధానాలు ఉంటాయని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రశాంత్‌ నీల్‌ మాత్రం సలార్ 2 సినిమాను ఎప్పుడు తీసుకు వచ్చేది చెప్పడం లేదు.

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ 'డ్రాగన్‌' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న డ్రాగన్‌ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు, డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. డ్రాగన్‌ సినిమా తర్వాత సలార్‌ 2 వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇటీవల ప్రశాంత్‌ నీల్‌ కొత్త ప్రాజెక్ట్‌కు కమిట్‌ అయ్యాడు. అల్లు అర్జున్‌తో ఒక సినిమాను ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్నాడు.

ప్రస్తుతం అట్లీతో అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న డ్రాగన్‌ సినిమా విడుదల తర్వాత సలార్‌ 2 విడుదల ఉంటుందని ఎదురు చూస్తున్న వారికి అల్లు అర్జున్‌తో ప్రశాంత్‌ నీల్‌ మూవీ అంటూ వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి. సలార్‌ 2 సినిమా ఉండదేమో అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ సలార్‌ 2 గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ 80 నుంచి 90 శాతం పూర్తి చేశారు. కనుక విడుదల కచ్చితంగా ఉండక పోవడం అనేది ఉండదు. సలార్‌ 2 నేడు కాకుంటే మరికొన్ని రోజుల తర్వాత అయినా విడుదల ఉంటుంది.

సలార్‌ 2 సినిమా 2026 ద్వితీయార్థంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డ్రాగన్‌ సినిమా విడుదల తర్వాత రెండు నెలల సమయం తీసుకుని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సలార్‌ 2 వంటి సినిమాలు ఎంతగా వెయిట్‌ చేయిస్తే అంతగా వెయిట్‌ పెరుగుతాయి. అందుకే సలార్‌ 2 ను కాస్త ఆలస్యంగా తీసుకు రావడం మంచిది అనే అభిప్రాయంతో ప్రశాంత్‌ నీల్‌ ఉండవచ్చు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సలార్‌ 2 మొత్తానికే క్యాన్సల్‌ అయ్యి ఉండవచ్చు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఖచ్చితంగా సలార్‌ 2 ఉంటుంది, అది మొదటి పార్ట్‌ను మించి ఉండటం మాత్రమే కాకుండా అంతకు మించి అన్నట్లు వసూళ్లు నమోదు చేయడం ఖాయం.