ఖుష్బూ డ్రీమ్ ఫైనల్‌గా నెరవేరుతోంది!
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే
By: Tupaki Political Desk | 7 March 2026 4:07 PM ISTమాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. `డ్రాగన్` పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మేకర్స్ కూడా దాదాపుగా ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేస్తున్నారు. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ మూవీ కోసం ఎన్టీఆర్ స్టోరీ డిమాండ్ కారణంగా షాకిచ్చే స్థాయిలో బరువు తగ్గడం తెలిసిందే. ఇందులోని కీలక పాత్రల్లో మలయాళ క్రేజీ హీరో టొవినో థామస్, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్నారు. `కేజీఎఫ్ సిరీస్, `సలార్` వంటి సంచలన పాన్ ఇండియా మూవీస్ తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్‌తో ఆయన చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అంచనాలకు మించి భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీలో ఇటీవలే బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ వచ్చి చేరారు.
చైనా, భూటాన్ సరిహద్దులోని ఓ ప్రాంతం నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే టీమ్ కీలక యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ కోసం జోర్డాన్ వెళ్లి తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాలెన్స్ ఫైట్ సీక్వెన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లలో చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలోకి మరో పవర్ ఫుల్ లేడీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తనే ఖుష్బు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్లకు మంచి స్కోప్ ఉంటుందన్నది తెలిసిందే.
ఆ విషయాన్ని కేజీఎఫ్ చాప్టర్ 2లోని రవీనాటాండన్ పోషించిన ఇందిరా గాంధీ క్యారెక్టర్, `సలార్`లోని శ్రియా శెడ్డి పోషించిన `రాధారమ` క్యారెక్టర్‌లు స్పష్టం చేశాయి. ఎన్టీఆర్ `డ్రాగన్` మూవీలోనూ ఇదే తరహాలో సాగే పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్ర కోసం ప్రశాత్ నీల్ సీనియర్ లేడీ ఖుష్బూని ఫైనల్ చేసుకున్నట్టుగా తెలిసింది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమా చేయాలన్న డ్రీమ్ ఉందని తమన మనసులోని మాటని బయటపెట్టారు ఖుష్బూ. ఆ డ్రీమ్ ఇన్నాళ్లు `డ్రాగన్` రూపంలో తీరబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనని మేకర్స్ విడుదల చేయబోతున్నారని తెలిసింది. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ అవతార్‌లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. 1969 నేపథ్యంలో సాగే ఎపిక్ యాక్షన్ డ్రామా ఇది. దీనికి రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇంత వరకు కనిపించని హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్.
