Begin typing your search above and press return to search.

తారక్ 'డ్రాగన్'.. నీల్ ప్లాన్ చేంజ్ చేశారా?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆయన పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే షేడ్ విజువల్స్. ఎందుకంటే కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో ఆయన స్పెషల్ విజువల్ స్టైల్‌ ను సెట్ చేశారు.

By:  M Prashanth   |   8 Feb 2026 10:00 PM IST
తారక్ డ్రాగన్.. నీల్ ప్లాన్ చేంజ్ చేశారా?
X

డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆయన పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే షేడ్ విజువల్స్. ఎందుకంటే కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో ఆయన స్పెషల్ విజువల్ స్టైల్‌ ను సెట్ చేశారు. అయితే ఇప్పుడు తన స్టైల్‌ కు భిన్నంగా, కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ కంప్లీట్ గా కలర్‌ ఫుల్ ట్రీట్‌ తో రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సినిమాల్లో మాస్ యాక్షన్‌ తో పాటు డార్క్ ఫ్రేమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్‌ తో చేసే మూవీ కూడా అదే తరహాలో ఉంటుందని అంతా భావించారు. కానీ ఈసారి నీల్ తన సిగ్నేచర్ స్టైల్‌ కు బ్రేక్ ఇస్తూ, ఫుల్ కలర్ ప్యాలెట్‌ లో సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బ్లాక్, గ్రే షేడ్స్ కనిపించకుండా.. విజువల్స్ పరంగా ఫ్రెష్ లుక్ ఇవ్వాలనే ప్లాన్‌ లో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా మూవీ రూపొందుతుండగా.. యాక్షన్ ఎపిసోడ్స్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్స్, భారీ స్కేల్ ఫైట్స్ ప్రేక్షకులను అలరించనున్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. ఎన్టీఆర్ కెరీర్‌ లోనే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌ గా నిలిచేలా ప్రశాంత్ నీల్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమాలో ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ప్రజెంట్ తీరు హైలైట్ కానుందని వినికిడి. రోల్ కోసం తారక్ ప్రత్యేకంగా.. ఎంతో డెడికేషన్ తో చాలా వెయిట్ తగ్గి స్లిమ్ లుక్‌ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన మేకోవర్ చూసి అభిమానులు, సినీ ప్రియులు షాక్ అయ్యారు. కానీ మూవీలో మాత్రం తారక్ క్యారక్టరైజేషన్ మరింత స్టైలిష్‌ గా, పవర్‌ ఫుల్‌ గా ఉంటుందని టాక్.

ఇక సినిమా విషయానికొస్తే.. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న డ్రాగన్ లో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనుండగా, మాలీవుడ్ స్టార్ టోవినో థామస్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాయి.

నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుండగా.. కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో డ్రాగన్ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరి డార్క్ స్టైల్‌ కు బ్రేక్ ఇచ్చి కలర్‌ ఫుల్ టేకింగ్‌ తో రాబోతున్న డ్రాగన్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.