వీడియో : నీల్ బర్త్‌డేకి 'డ్రాగన్' సెట్‌లో లైఫ్ టైమ్ గుర్తుండే గిఫ్ట్
కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 4 Jun 2025 11:58 AM ISTకేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. మొదటి షెడ్యూల్‌ను కర్ణాటకలో భారీ ఎత్తున చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నాడు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, టాకీ పార్ట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా డ్రాగన్ యూనిట్ సభ్యులతో పాటు, ప్రశాంత్ నీల్ సన్నిహితులకు భారీ నైట్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీలో ప్రశాంత్ ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశాడో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.
ప్రశాంత్ నీల్ భార్య లికిత రెడ్డి నీల్ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రశాంత్ నీల్ బర్త్‌డే కోసం ఏర్పాటు చేసిన సెటప్‌లో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను స్ట్రీమింగ్ చేశారు. ఆర్‌సీబీ అభిమాని అయిన ప్రశాంత్ నీల్ సుదీర్ఘ కాలంగా ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచిన వెంటనే ప్రశాంత్ నీల్ అక్కడ అంతా పరుగులు పెడుతూ తోటి వారిని హగ్ చేసుకుంటూ చేసిన హడావుడి వీడియోను లికిత రెడ్డి నీల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ వీడియోకు.. నాకు తెలిసినంత వరకు ఒక క్రేజీ క్రికెట్ అభిమానికి ఇంత కంటే గొప్పదైన పుట్టిన రోజు బహుమతి ఉండదు అని కామెంట్ రాసుకు వచ్చింది.
దేశం మొత్తం విరాట్ కోహ్లీ జట్టు విజయాన్ని ఆస్వాదించారు. అలాంటిది బెంగళూరుకు చెందిన ప్రశాంత్ నీల్ ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తాడో అర్థం చేసుకోవచ్చు. అమితమైన క్రికెట్ అభిమాని, ఆ పై కన్నడ వ్యక్తి కావడంతో బెంగళూరు విజయం ఆయనకు ఏ స్థాయి ఆనందాన్ని కలిగించిందో అనేది ఈ వీడియోలో చూడవచ్చు. ప్రశాంత్ నీల్ సంతోషంతో మొత్తం పరిగెట్టడం, అక్కడ ఆయన చేసిన సందడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్‌తో పాటు బెంగళూరు విజయాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. బెంగళూరుకు చెందిన వారు మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో ఎంతో మంది ఆర్‌సీబీ విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.
సలార్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఆ వెంటనే సలార్ 2 సినిమాతో వస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాను మొదలు పెట్టాడు. చాలా స్పీడ్‌గా సినిమాను పూర్తి చేసి 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. కానీ షూటింగ్ కాస్త ఆలస్యం కావడం వల్ల కాస్త ఆలస్యంగా అంటే 2026 సమ్మర్‌కి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేశారు. ఆమెతో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. డ్రాగన్ సినిమా నుంచి గ్లిమ్స్, టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
