తమిళ యాక్టర్ ఆ రిస్క్ తీసుకుంటాడా?
ఒకప్పుడంటే రీమేక్ సినిమాలకు బాగా వాల్యూ ఉండేది. వేరే భాషలో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను తమ ప్రాంతానికి తగ్గట్టు మార్చి రీమేక్ చేసేవాళ్లు.
By: Tupaki Desk | 27 July 2025 12:00 AM ISTఒకప్పుడంటే రీమేక్ సినిమాలకు బాగా వాల్యూ ఉండేది. వేరే భాషలో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను తమ ప్రాంతానికి తగ్గట్టు మార్చి రీమేక్ చేసేవాళ్లు. అలా చేసిన ఎన్నో రీమేక్స్ హిట్లుగా నిలిచాయి. కానీ ఇప్పుడు జెనరేషన్ మారిపోయింది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీలకు ఎవరూ ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది.
ఓటీటీల వల్ల మొత్తం మారిపోయింది. ఒకప్పటిలా పరిస్థితులు లేవు. ఫలానా సినిమా రిలీజైంది, బావుందని తెలిస్తే చాలు. వెంటనే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాను చూసేస్తున్నారు. దీని వల్ల ఆ సినిమాలను రీమేక్ చేసినా వాటికి పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఏవో కొన్ని సినిమాలు వర్కవుట్ అవుతాయి తప్పించి ఈ రోజుల్లో రీమేక్ అంటే రిస్క్ అనే చెప్పాలి.
ఇక అసలు విషయానికొస్తే కోలీవుడ్ నటుడు ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ హిట్ మూవీ అంధాధున్ రీమేక్ అంధాగన్ లో హీరోగా నటించిన ప్రశాంత్ ఇప్పుడు రీసెంట్ గా టాలీవుడ్ లో హిట్ అయిన కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సినిమాను రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. కృతిక్ నిర్మాతగా నటి దేవయాని కూతురు ఇనియా కీలక పాత్రలో ఈ రీమేక్ ను చేయాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ వార్త బయటికొచ్చినప్పటి నుంచి కొందరు నెటిజన్లు ఇప్పుడీ రీమేక్ అవసరమా అని అంటుంటే, మరికొందరు మాత్రం ప్రశాంత్ కేవలం ఇతర భాషల్లోని హిట్ సినిమాలను రీమేక్ చేయడమే కాకుండా ఒరిజినల్ కథలను కూడా చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ప్రశాంత్ కోర్ట్ సినిమా రీమేక్ చేయనున్నారనేది కేవలం పుకారుగా మాత్రమే ఉంటుంది. మరి ప్రశాంత్ ఆ రిస్క్ తీసుకుంటారో లేదా చూడాలి.
