Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ ప్రపంచంలో ఆ మాస్ హీరో కూడా..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఆ! లో ఒక చేపకి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 12:52 PM GMT
ప్రశాంత్ వర్మ ప్రపంచంలో ఆ మాస్ హీరో కూడా..
X

మాస్ మహారాజ్ రవితేజతో మూవీస్ చేయడానికి చాలా మంది దర్శకులు సిద్ధం అవుతున్నారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రవితేజ నుంచి ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాల చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఆ! లో ఒక చేపకి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది బాగా కనెక్ట్ అయ్యింది.

తాజాగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీలో కోటి అనే కోతికి కూడా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది కూడా మూవీలో బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే కోతి క్యారెక్టర్ కి కూడా మూవీలో మంది ప్రాధాన్యత ఉంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ రవితేజతో కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో ఒక మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈ విషయాన్ని చూచాయగా హనుమాన్ మూవీ ఈవెంట్ లోనే చెప్పాడు.

తన సినిమాటిక్ యూనివర్స్ లో రవితేజ కోసం ఒక ఇంటరెస్టింగ్ లైన్ అనుకున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో రవితేజ గారు కోతి క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ చెబితే బాగుంటుంది అడిగామని అన్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రవితేజ గారు మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారని, అయిన కూడా అడగగానే వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

రవితేజ గారి కోసం కోటి క్యారెక్టర్ తోనే ఓ ఇంటరెస్టింగ్ స్టోరీలైన్ అనుకున్నా అని, దానిని టైం చూసుకొని చెబుతానని అన్నారు. ఆయన ఒకే అంటే తన సినిమాటిక్ యూనివర్స్ లో మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఒక వేళ రవితేజతో మూవీ ప్రశాంత్ వర్మ సినిమా చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఉంటుంది. సూపర్ హీరో సినిమాలలో కూడా కామిక్ హీరో క్యారెక్టర్స్ ఉంటాయి.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే పనిలో ఉన్నారు. స్టార్ హీరోతో ఈ సినిమాని చేయనున్నాడు. దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీరా మూవీ ఒకటి సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సూపర్ విమెన్ స్టోరీతో మూవీ చేయనున్నాడు.