Begin typing your search above and press return to search.

హనుమాన్ డైరెక్టర్ లో ఈ టాలెంట్ కూడానా..?

లేటెస్ట్ సెన్సేషన్ హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు

By:  Tupaki Desk   |   31 Jan 2024 9:48 AM GMT
హనుమాన్ డైరెక్టర్ లో ఈ టాలెంట్ కూడానా..?
X

లేటెస్ట్ సెన్సేషన్ హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. అతని మొదటి సినిమా అ! నుంచి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ తో ఔరా అనిపించాడు. తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ విషయంలో అన్ని అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యాయి. హనుమాన్ రిలీజ్ దగ్గర నుంచి ప్రశాంత్ వర్మ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అతని గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడియన్స్.

ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ గురించి మరో సూపర్ టాలెంట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ బ్యాక్ టు ప్రాక్టీస్ అని తన సోషల్ మీడియాలో నెట్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. అప్పుడు అర్ధమైంది ప్రశాంత్ వర్మ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు ఒక క్రికెటర్ అని కూడా. స్కూల్ డేస్ నుంచి క్రికెట్ మీద ఇష్టం ఉన్న ప్రశాంత్ వర్మ స్కూల్ టోర్నమెంట్స్ తో పాటుగా డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ లను కూడా ఆడాడట.

బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో మెప్పిస్తాడట ప్రశాంత్ వర్మ. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా అతను భాగం అయ్యాడు. సినిమాల గ్యాప్ తో ప్రశాంత్ వర్మ రెగ్యులర్ క్రికెట్ ఆడతాడట. ఇప్పటికీ ఎక్కడ మ్యాచ్ జరిగినా సరే వెళ్లి ఆడతాడని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మలోని ఈ ప్రొఫెషనల్ క్రికెటర్ యాంగిల్ ఎవరికి తెలియదు.

డైరెక్టర్ గా యూనిట్ ని చక్కబెట్టడం.. సినిమాను అద్భుతంగా తీయడమే కాదు ఫీల్డ్ లో సిక్సులు కొట్టడం వికెట్లు తీయడం కూడా వచ్చని తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్ గా తనకున్న ప్రై ప్యాషన్ ని సమర్ధవంతంగా నెరవేస్తూ వస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అంతేకాదు ప్రశాంత్ వర్మకి బ్యాడ్మింటన్ లో కూడా టచ్ ఉందని తెలుస్తుంది. మరి ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్ లు ఏంటి బాబోయ్ అని అనుకోవడం ఆడియన్స్ వంతు అయ్యింది. హనుమాన్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ ని కూడా అంతకు మించి అనిపించేలా తీస్తాడని అంటున్నాడు. అయితే ఈలోగా తన డైరెక్షన్ లో వస్తున్న అథీరా, మహాకాళి సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ.