Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్.. నెక్స్ట్ ఏంటి మరి?

అయితే ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అని ముందుగానే క్లారిటీ ఇచ్చాడు ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై మాత్రం ఆయన పెద్దగా వివరణ అయితే ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 11:30 AM GMT
ప్రశాంత్ నీల్.. నెక్స్ట్ ఏంటి మరి?
X

KGF తో కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ తో బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకున్న నిర్మాతలు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక సినిమా ఈవారం లో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనే దాని పైన రిజల్ట్ ఆధారపడి ఉంది.

అయితే ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అని ముందుగానే క్లారిటీ ఇచ్చాడు ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై మాత్రం ఆయన పెద్దగా వివరణ అయితే ఇవ్వలేదు. అలాగే ప్రశాంత్ లైనప్ లో మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుపై ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పటికే అఫీషియల్ గా ఒక పోస్టర్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే హిందీలో వార్ 2 సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే దేవర కూడా రెండు భాగాలుగా ఉంటుంది అని దర్శకుడు కొరటాల ఆ మధ్య వివరణ ఇచ్చాడు.

కాబట్టి దేవర 2 కూడా ఎన్టీఆర్ వచ్చే ఏడూ కాస్త బిజీగా ఉండవచ్చు. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్టు 2024లో మొదలవుతుందా లేదా అనే విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఎక్కువగానే ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ రాంచరణ్ తో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలోనే ప్రత్యేకంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లి మరి వారిని కలిశాడు. కానీ ప్రాజెక్టు ఉంటుంది అని మాత్రం అప్పుడు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

ఇక కేజిఎఫ్ పార్ట్ 3 కూడా ఉంటుంది అని ఈ దర్శకుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి కానీ ప్రశాంత్ నిల్ ఏది నెక్స్ట్ మొదలుపెడుతాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా తెలుగు హీరోతోనే సినిమా ఉంటుందని టాక్ వస్తోంది. మరి ప్రశాంత్ సలార్ 2 ని తెరపైకి తీసుకు వస్తాడా లేదంటే ఎన్టీఆర్ ప్రాజెక్టు ను స్టార్ట్ చేస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.