Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ నీల్ ఒక్క‌డే హ్యాపీగా ఉన్నాడా?

దీంతో ఇప్పుడీ సినిమాకి అంత‌ర్జాతీయ స్థాయిలో రీచ్ దొరుకుతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్కువ‌గా సంతోషంగా ఉండే వ్య‌క్తి ఎవ‌రు? అంటే ప్ర‌శాంత్ నీల్ పేరు సూచిస్తున్నారంతా.

By:  Tupaki Desk   |   27 Jan 2024 12:30 PM GMT
ప్ర‌శాంత్ నీల్ ఒక్క‌డే హ్యాపీగా ఉన్నాడా?
X

పాన్ ఇండియా స్టార్ మేక‌ర్ ప్ర‌శాంత్ నీల్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వెళ్లి ఇండియానే షేక్ చేసిన ద‌ర్శ‌కుడు. తొలి సినిమా 'ఉగ్రం'తోనే త‌న విజ‌న్ ఎలా ఉంటుంద‌ని చాటి చెప్పాడు. అటుపై తెర‌కెక్కించిన 'కేజీఎఫ్' రెండు భాగాలు పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో స‌క్సెస్ అయ్యాయో తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'స‌లార్' సంచ‌ల‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే ఈ సినిమా 'ఉగ్రం' చిత్రాన్ని పోలి ఉందంటూ కొన్ని క‌థ‌నాలు ఉన్నాయి. అలాగే సలార్ స్టోరీ ఏంటి? అన్న‌ది కొంత మందికి అర్దం కాలేద‌ని నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఈ సినిమా 700 కోట్లు వ‌సూళ్లు సాధించినా కేవ‌లం ఎలివేష‌న్ తోనే సాధ్య‌మైంది త‌ప్ప‌! స్టోరీతో కాదని..ఆవిష‌యంలో నీల్ ఒక్క‌డే సంతోషంగా ఉన్నాడ‌ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ సైతం తెరపైకి వ‌చ్చాయి. ఇక ప్ర‌శాంత్ కి బాగా ఇష్ట‌మైన చిత్రం ఏది అంటే ఆయ‌న ఠ‌క్కున చెప్పే టైటిల్ ఉగ్రం.

త‌న డెబ్యూ వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. తాజాగా 'స‌లార్' ఇటీవ‌ల ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడీ సినిమాకి అంత‌ర్జాతీయ స్థాయిలో రీచ్ దొరుకుతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్కువ‌గా సంతోషంగా ఉండే వ్య‌క్తి ఎవ‌రు? అంటే ప్ర‌శాంత్ నీల్ పేరు సూచిస్తున్నారంతా. త‌న‌కి వ్య‌క్తిగ‌తంగా ఇష్ట‌మైన ఉగ్రం సినిమాని లైక్ చేస్తారు..కాబ‌ట్టి ఆ త‌ర‌హా కంటెంట్ స‌లార్ రూపంలో పాన్ ఇండియాకి చేర‌డంతో మ‌రింత సంతోషంగా ఉంటార‌ని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి.

తాను ఒక్క‌డే సోలోగా ఈ స‌క్సెస్ ని ఎంజాయ్ చేయ‌గ‌ల‌డ‌ని ప్రెడిక్ట్ చేస్తున్నారు. మ‌రి తానెంత సంతో షంగా ఉన్నాడు? అన్న‌ది ఆయ‌న స్పందిస్తే త‌ప్ప క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం ప్రశాంత్ నీల్ రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. స‌లార్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ వ‌ర‌కూ గ్యాప్ లేకుండా ప‌నిచేసారు. అతి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ స‌లార్ -2 షూటింగ్ మొద‌ల‌వుతుంది. 15 నెలల్లోనే స‌లార్ -2 రిలీజ్ చేస్తామ‌ని అభిమానుల‌కు నీల్ ప్రామిస్ చేసిన సంగ‌తి తెలిసిందే.