హనుమాన్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు..?
అ! సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటి కల్కితో ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు.
By: Tupaki Desk | 11 May 2025 1:30 AMఅ! సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటి కల్కితో ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోయింది. హనుమాన్ చివర్లో సీక్వెల్ జై హనుమాన్ ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అసలైతే ఆ సినిమా ఈ ఇయర్ రావాల్సింది కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.
ఇదే కాదు ప్రశాంత్ వర్మ మరో రెండు సినిమాలు కూడా కమిట్ అయ్యాడు. హనుమాన్ తర్వాత జై హనుమాన్ కన్నా ముందు రెండు సినిమాలు పూర్తి చేయాలని అనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఐతే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పూర్తి చేయాలని చూస్తున్నా ఈ సినిమాలో రిషబ్ శెట్టి ని తీసుకున్నారు కాబట్టి అతని డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
హనుమాన్ సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఐతే ఆ మూమెంట్ లోనే వెంటనే జై హనుమాన్ పూర్తి చేసుంటే అయిపోయేది కానీ జై హనుమాన్ కాస్టింగ్ కోసమే చాలా టైం తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. అందుకే చేసేదేమి లేక వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతను రిషబ్ శెట్టి ఖాళీ అయ్యేదాకా వెయిట్ చేయక తప్పట్లేదు. ఓ పక్క రిషబ్ శెట్టి కాంతారా 1 సినిమాను పూర్తి చేసిన తర్వాతే ఏ సినిమా అయినా చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఈలోగా ప్రశాంత్ వర్మ తను కమిటైన వేరే సినిమాలు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అదిరిపోయే టాలెంట్ ఉన్న ప్రశాంత్ వర్మ సినిమాల విషయంలో క్లారిటీ కాస్త మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఐతే అవుట్ పుట్ మీద ఈ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడితే మంచింది. ఈమధ్యనే అతను గల్లా అశోక్ నటించిన దేవకి నందన వాసుదేవ సినిమాకు కథ అందించాడు. ఆ సినిమా సక్సెస్ అవుతుందని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా చూసి ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ జై హనుమాన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిషబ్ డేట్స్ ఇవ్వాలి సినిమా పూర్తవ్వాలి అనే పరిస్థితి చూస్తుంటే జై హనుమాన్ 2026 చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.