ప్రశాంత్ వర్మ కన్ఫ్యూజన్‌తో క్లారిటీ మిస్సవుతున్నాడా?
ఆ తరువాత ప్రశాంత్ వర్మ మరో భారీ బాధ్యతని తీసుకున్నాడని ప్రచారం జరిగింది.
By: Tupaki Desk | 13 May 2025 5:30 PMఅ!, కల్కి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ `హను మాన్` మూవీతో మాత్రం తిరుగులేని విజయాన్ని సాధించి పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్‌ల జాబితాలో చేరిపోయాడు. తేజ సజ్జతో రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రశాంత్ వర్మ చేసిన ఈ సాహసం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ.40 కోట్లతో నిర్మిస్తే అనూహ్యంగా వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో రూ.300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ పండితుల్నే విస్మయానికి గురి చేసింది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.
దీంతో వరుసగా క్రేజీ ఆఫర్లు ఆయన తలుపు తట్టడం మొదలు పెట్టాయి. అలా వచ్చిన క్రేజీ బాలీవుడ్ ఆఫర్ రన్‌వీర్ సింగ్. తనతో భారీ స్థాయిలో ఓ సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్న ప్రశాంత్ వర్మ లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశాడు. కానీ ఆ తరువాత ఇద్దరి మధ్య ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ సింగ్ తప్పుకుని ప్రశాంత్ వర్మకు షాక్ ఇచ్చాడు. ఊహించని బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారడంతో అంతా అవాక్కయ్యారు.
ఆ తరువాత ప్రశాంత్ వర్మ మరో భారీ బాధ్యతని తీసుకున్నాడని ప్రచారం జరిగింది. తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరపైకి తీసుకురానున్న భారీ మూవీతో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయనున్నాడని ప్రచారం జరిగింది. ప్రశాంత్ వర్మపై ఉన్న నమ్మకంతో వారసుడి బాధ్యతల్ని బాలయ్య అతనికి అప్పగించాడని ఇండస్ట్రీ వర్గాలుకూడా అన్నాయి. కానీ అది మాటలకే పరిమితం అయిందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని నాటకీయ పరిణామాల వల్లే ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ చేజార్చుకున్నాడని ఇన్ సైడ్ టాక్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని డీల్ చేస్తుండటం వల్లే ప్రశాంత్ వర్మ కన్ఫ్యూజన్‌తో క్లారిటీ మిస్సవుతున్నాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. తన పద్దతి మార్చుకోకపోతే ప్రభాస్‌తో చేయాలనుకుంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అంతే సంగతులని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.