సూపర్ హీరో 'అధీరా' సౌండ్ లేదేంటి వర్మ!
ఈ కోవలోకే వస్తుంది ప్రశాంత్ వర్మ `అధీరా`. సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా సూపర్ హీరో స్టోరీగా `అధీరా`ను తెరకెక్కిస్తున్నానని ప్రకటించిన ప్రశాంత్ వర్మ ఆ తరువాత ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేయడం తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 4:47 PM ISTదక్షిణాది సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడిన నేపథ్యంలో మన దర్శకులు కొంత మంది సినిమాటిక్ యూనివర్స్, సినిమాటిక్ వరల్డ్ అంటూ వరుపసగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఒక్కరిద్దరు డైరెక్టర్లు ఇప్పటికే తమసినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో సినిమాలు చేస్తుంటే మరి కొంత మంది మాత్రం ప్రకటించి సినిమాలు మాత్రం బయటికి తీసుకురావడం లేదు. క్రేజీ ప్రాజెక్ట్‌లని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదు.
ఈ కోవలోకే వస్తుంది ప్రశాంత్ వర్మ `అధీరా`. సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా సూపర్ హీరో స్టోరీగా `అధీరా`ను తెరకెక్కిస్తున్నానని ప్రకటించిన ప్రశాంత్ వర్మ ఆ తరువాత ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేయడం తెలిసిందే. ఈ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసిరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ హను మాన్ కంటే ముందు విడుదలైంది. అయినా సరే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అప్ డేట్ లేదు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణలో `మహాంకాళి` మొదలైంది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. డైరెక్ట్ చేస్తున్న సినిమా `అధీరా`ని పక్కన పెట్టి ప్రశాంత్ వర్మ కథలు అమ్ముకుంటూ కొత్త సినిమాలు మొదలు పెట్టిస్తుండటం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రశాంత్ వర్మ తను ఏం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతోందా? అనే కామెంట్‌లు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
`అధీరా` ఇప్పటికీ పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణం దర్శకుడు లేకపోవడమేనని ఓ షాకింగ్ విషయం బయటికొచ్చింది. ప్రశాంత్ వర్మ ఉండగా మరో దర్శకుడేంటీ? అని షాక్ అవుతున్నారు. తను కథ, స్క్రీన్‌ప్లేతో పాటు ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తాడు. డైరెక్షన్ చేయడు. దానికి తనకు ఓ డైరెక్టర్ కావాలి. అలా పని చేయడానికి ఇప్పటి వరకు ఎవరూ ఓకే చెప్పలేదు. దీంతో `అధీరా` ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ ప్రవర్తిస్తున్న తీరు చూసి షాకవుతున్న కొంత మంది ఓవర్ స్పార్ట్‌గా ఆలోచిస్తే ఇలాగే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు.
ఆ మధ్య దీనికి దర్శకుడిగా విజయ్ బిన్నీని అనుకున్నాడు వర్మ కానీ అది కుదరలేదు. దీంతో ప్రస్తుతం `అధీరా`కు దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. అయితే దీనికి ప్రశాంత్ వర్మ దర్శకుడైతే బాగుంటుందన్నది నిర్మాత దానయ్య వాదన కానీ ఆ విషయాన్ని గట్టిగా తనకు చెప్పలేకపోతున్నాడు. ఇలాగే ఈ ప్రాజెక్ట్ డిలే అయితే `అధీరా` ప్రాజెక్ట్ ఒకటి ఉందన్న విషయం జనం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రశాంత్ వర్మ మనసు మార్చుకుని వెంటనే అధీరాని పట్టాలెక్కిస్తే మంచిదని లేదంటే మొదటికే మోసం అయ్యే అవకాశాలున్నాయి.
