Begin typing your search above and press return to search.

బోసుపోయిన ఐ- మ్యాక్స్..షాక్ లో ఫ్యాన్స్!

సాధార‌ణ ప్రేక్ష‌కులు.. ఇండ‌స్ట్రీకి చెందిన వారు...రివ్యూ రైట‌ర్లు..మీడియా కెమెరా మెన్లు ఇలా చాలా హంగామా ఉంటుందా రోజు.

By:  Tupaki Desk   |   17 May 2024 12:51 PM GMT
బోసుపోయిన ఐ- మ్యాక్స్..షాక్ లో ఫ్యాన్స్!
X

శుక్ర‌వారం వ‌చ్చిందంటే కొత్త సినిమాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఇక ప్ర‌ఖ్యాత ప్ర‌సాద్ ఐమ్యాక్స్ వ‌ద్ద ప్రైడే వ‌చ్చిందంటే? ఎంత‌టి హంగామా నెల‌కొంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. సాధార‌ణంగా సిటీలోనే అత్యంత‌ నిత్యం ర‌ద్దీగా ఉండే థియేటర్ అది. శుక్ర‌వారం కొత్త రిలీజ్ లుంటే మ‌రింత ర‌ద్దీగా మారుతుంది. వ‌చ్చేపోయే జ‌నాల‌తో మ‌రింత వైభ‌వంగా క‌నిపిస్తుంది. సాధార‌ణ ప్రేక్ష‌కులు.. ఇండ‌స్ట్రీకి చెందిన వారు...రివ్యూ రైట‌ర్లు..మీడియా కెమెరా మెన్లు ఇలా చాలా హంగామా ఉంటుందా రోజు.

మార్నింగ్ ఏడు గంట‌ల నుంచే అక్క‌డో వైబ్ మొద‌లైపోతుంది. తొలి షో రిలీజ్ టాక్ వ‌చ్చే వ‌ర‌కూ అంతే ఎన‌ర్జీ అక్క‌డ క‌నిపిస్తుంది. షో అనంత‌రం పీడ్ బ్యాక్ లు...రివ్యూలంటూ బోలెడు యూట్యూబ్ ఛానెల్స్...మీడియా ఛాన‌ల్స్..రివ్యూరైట‌ర్ల‌ హ‌డావుడి ఉంటుంది. కానీ నేటి శుక్ర‌వారం ప్ర‌సాద్ ఐమ్యాక్స్ వ‌ద్ద ప‌రిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఐమ్యాక్స్ ఇంత బోసిపోయిందేట‌ని అనుకుంటారు. అవును ఆపిక్ చూస్తే అంద‌రికీ అలాగే అనిపిస్తుంది.

కొత్త రిలీజ్ లు లేక‌పోవ‌డంతో నేడు ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. కనీసం మీడియం సినిమా ఒక్క‌టి కూడా ఈవారం రిలీజ్ లో లేదు. స్టార్ హీరోల సినిమాల‌న్నీ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. స‌మ్మ‌ర్ కార‌ణంగా కొంత మంది హీరోలు షూటింగ్ ల‌కు బ్రేక్ ఇచ్చారు. రిలీజ్ అవ్వాల్సి `క‌ల్కీ`..`డ‌బుల్ ఇస్మార్ట్` లాంటి సినిమాలు ఎన్నిక‌ల కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. దీంతో శుక్ర‌వారం ఐమ్యాక్స్ వ‌ద్ద ఇంత ద‌య‌నీయ ప‌రిస్థితి నెల‌కొంది.

ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రిన్ థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. రిలీజ్ లు లేక‌పోవ‌డంతో పాటు థియేట‌ర్ల‌ను మూసేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఐమ్యాక్స్ ని చూస్తుంటే సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ స‌న్నివేశం ఇక్క‌డా కూడా క‌నిపించిన‌ట్లు అయింది. ఇప్ప‌టికే బాగున్న సినిమాల‌కే జ‌నాలు రావ‌డం లేద‌ని ల‌బోదిబో మ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. తాజాగా ఐమ్యాక్స్ వ‌ద్ద స‌న్నివేశం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఐమ్యాక్స్ వ‌ద్ద ఇలాంటి ప‌రిస్థితి ఇంత‌వ‌ర‌కూ చోటు చేసుకోలేద‌ని చ‌ర్చించుకుంటున్నారు.