పిక్‌టాక్ : అందాల స్టైలిష్ బాపు బొమ్మ ను చూశారా!
టాలీవుడ్‌లో ఈమె చేసిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించినప్పటికీ ఈమెకు గుర్తింపు లభించింది.
By: Tupaki Desk | 8 April 2025 5:07 PMకన్నడ మూవీ పోర్కి సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం సినిమాల్లోనూ నటించింది. తెలుగులో 2010లో ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో, బావ సినిమాల్లో నటించింది. ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే ఏకంగా మూడు సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సోషల్ మీడియాలోనూ ఈమెకు మంచి క్రేజ్ దక్కింది. టాలీవుడ్‌లో ఈమె చేసిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించినప్పటికీ ఈమెకు గుర్తింపు లభించింది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆ సినిమాలో ప్రణీతకు బాపు బొమ్మ అంటూ సాంగ్ ఉంది. ఆ పాట కారణంగా ప్రణీతను తెలుగు ప్రేక్షకులు బాపు బొమ్మ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉండే ప్రణీత సుభాష్ తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈమె సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ అమ్మడు తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ ఉంది. ఈమధ్య కాలంలో కాస్త స్లో అయింది అనిపించినా ముందు ముందు మరిన్ని సినిమాలు చేయనుందని ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది.
ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొబైల్‌లోని ఫోటోలను స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ అందమైన ఫోటోలు కనిపించాయి అంటూ సరదాగా ఈ ఫోటోలను షేర్ చేసింది. ప్రణీతను ఈ క్లిక్స్‌లో చాలా స్టైలిష్ అవతార్‌లో చూడవచ్చు. అంతే కాకుండా ఈమె లుక్‌కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రణీత ఎప్పుడు ఫోటోలు షేర్ చేసినా కూడా వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అయ్యాయి. అందాల స్టైలిష్ బాపు బొమ్మ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఈ అమ్మడు ఆకట్టుకుంటోంది.
స్టైలిష్ గాగుల్స్‌తో పాటు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో బ్లూ షర్ట్ ధరించి ఒక స్పెషల్ ఫుడ్ ఐటెంను తింటున్న ప్రణీత సుభాష్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. ఈసారి స్కిన్ షో చేయకున్నా క్యూట్ అందం కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపుగా ఆరున్నర మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు షేర్ చేసే ప్రతి ఫోటోకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోలకు సైతం మంచి స్పందన దక్కింది. ఇంత అందంగా ఉన్న ప్రణీతకు మరికొంత కాలం సినిమాల్లో హీరోయిన్‌గా ఆఫర్లు రావాల్సిందే అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.