పిక్ టాక్ : ప్రణీత మరోసారి మెస్మరైజ్..!
కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా కనిపిస్తూ కన్నుల విందు చేస్తోంది.
By: Tupaki Desk | 14 April 2025 2:00 AM ISTకన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా కనిపిస్తూ కన్నుల విందు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న పోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ప్రణీత సుభాష్ సొంతం. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటినా కూడా అందం ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఈమె అందం చూస్తే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ కంటే ఎంతో బెటర్ అనే అభిప్రాయంను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి పిల్లల తర్వాత సాధారణంగా సౌత్ హీరోయిన్స్ సినిమాలకు కాస్త దూరం అవుతారు, గ్లామర్ వరల్డ్‌కి సైతం దూరంగా ఉండాలి అనుకుంటారు. కానీ ప్రణీత సుభాష్ మాత్రం పెళ్లికి ముందు ఎలా అయితే ఉందో ఇప్పుడు అదే విధంగా చాలా బిజీగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. అందంగా ఉన్న ప్రణీత సుభాష్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లాంగ్ ఫ్రాక్ బ్లాక్ అండ్ వైట్ ఔట్‌ఫిట్‌తో ప్రణీత సుభాష్ చూడముచ్చటగా ఉంది. స్కిన్ షో చేయకున్నా ప్రణీత షేర్ చేసిన ఈ ఫోటోలను నెటిజన్స్ తెగ లైక్ చేస్తూ కామెంట్స్ చేశారు.
ప్రణీతను ఇలా బ్యాక్ టు బ్యాక్ అందమైన ఫోటోలు, వీడియోల్లో చూస్తూ ఉంటే ముందు ముందు నటిగా మళ్లీ బిజీ కావాలని ఆశ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయి అనేది చూడాలి. ఆకట్టుకునే అందంతో పాటు నటిగా మంచి ప్రతిభావంతురాలు కావడంతో ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే కచ్చితంగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యంగ్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం ద్వారా కచ్చితంగా ప్రణీత మళ్లీ బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి.
ఈమధ్య కాలంలో ప్రణీత సోషల్ మీడియాలో అధికంగా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్న కారణంగా ఆఫర్లను సైతం సొంతం చేసుకుంటుంది అనే టాక్ వినిపిస్తుంది. ఒక వైపు సినిమా ఆఫర్లతో పాటు మరో వైపు వెబ్ సిరీస్‌ల్లోనూ ఈమెకు నటించే అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్‌లు ఏమీ కమిట్ కాని ప్రణీత త్వరలోనే ఒకటి రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రణీత టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు హిందీ పరిశ్రమ నుంచి కూడా ఆఫర్లు దక్కించుకుంటుందని, కానీ ప్రస్తుతం ప్రణీత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. గత ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు వచ్చాయి. కానీ ఈ ఏడాదిలో ఆమె సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేనా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాది మాత్రం కచ్చితంగా రెండు సినిమాలతో ప్రణీత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
