Begin typing your search above and press return to search.

ప్రణీతా సుభాష్ గ్లామర్ ఎటాక్.. మైండ్ బ్లోయింగ్!

పెళ్లి అయ్యి తల్లి అయిన తర్వాత కూడా గ్లామర్ పరంగా తానేమీ తగ్గలేదని మరోసారి నిరూపించింది నటి ప్రణీతా సుభాష్.

By:  Tupaki Desk   |   22 May 2025 8:47 PM IST
ప్రణీతా సుభాష్ గ్లామర్ ఎటాక్.. మైండ్ బ్లోయింగ్!
X

పెళ్లి అయ్యి తల్లి అయిన తర్వాత కూడా గ్లామర్ పరంగా తానేమీ తగ్గలేదని మరోసారి నిరూపించింది నటి ప్రణీతా సుభాష్. ఈ మధ్య గ్లామర్ డోస్ తక్కువ చేసినా.. తాజాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె వేసిన రెడ్ గౌన్ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భారీ స్లిట్‌తో, డీప్ నెక్ డిజైన్‌తో ఉన్న ఈ ఔట్‌ఫిట్‌లో ప్రణీతా నవ్వుతూ ఇచ్చిన పోజులు అభిమానులనే కాదు, నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి.

శాంతను-నిఖిల్ డిజైన్ చేసిన ఈ ఎగ్జాటిక్ గౌన్ స్టైల్‌తో, ప్రణీతా అందం ఒక డిఫరెంట్ లెవెల్‌కు వెళ్లిపోయింది. ఇంతగానూ ఈ గ్లామర్ షోకి సోషల్ మీడియా నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. " వావ్", "ప్రణీతా ఎవర్‌గ్రీన్ బ్యూటీ", "ఇంత గ్లామర్ తో కళ్లకు కనిపించటం మొదటిసారి" అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్. ఆమె రీల్ మీదనే కాకుండా స్టిల్స్ పైనా భారీగా లైక్స్, షేర్లు రావడం విశేషం.

తెలుగులో బావ, అత్తారింటికి దారేది వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీతా, తమిళం, కన్నడలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె, ఇటీవల కొన్ని స్పెషల్ ఈవెంట్లలో మళ్లీ పబ్లిక్ అపియరెన్స్ ఇస్తోంది. తాజాగా ఆమె కాన్స్ 2025లో పాల్గొన్న లుక్‌తో మళ్లీ ఫిలిం క్రిటిక్స్ దృష్టిని ఆకర్షించింది.

ఇక ఈ ఫొటోల్లో కనిపించిన ప్రణీతా కాన్ఫిడెంట్, స్టన్నింగ్ లుక్ చూసిన తరువాత.. ఆమెను మళ్లీ తెరపై చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. "గ్లామర్ పరంగా ఇంతగా ఆకట్టుకునే విధంగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. వయసు, జీవిత పరిస్థితులు ఎంత మారినా.. గ్లామర్‌ను కాపాడుకోవడం తనకు ఎంత సులువు అనేది.. ప్రణీతా ఈ ఫోటోలతో మరోసారి ప్రూవ్ చేసింది.. ఇకపోతే ప్రణీతా మరోసారి సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.