తనయుడి కోసం స్నేహితుడి హిట్ చిత్రం-2
కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ ఏడాదికి ఆరేడు సినిమాలతో ప్రేక్షకుల మధ్యంలో ఉంటారు. కానీ తనయుడు ప్రణవ్ లావ్ మాత్రం ఆ వేగాన్ని ఇప్పట్లో అందుకునేలా లేడు.
By: Tupaki Desk | 14 May 2025 12:30 PMమమ్ముట్టి, మోహన్ లాల్ ఏడాదికి ఆరేడు సినిమాలతోకైనా ప్రేక్షకుల మధ్యలో ఉంటారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా స్టార్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్నారు. కానీ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లావ్ మాత్రం ఆ వేగాన్ని ఇప్పట్లో అందుకునేలా లేడు. ఇప్పటికీ తానింకా స్టార్ కాలేకపోయడు. సీరియస్ గా కెరీర్ పై ఫోకస్ చేయకపోవడంతో రేసులో చాలా వెనుకబడి ఉన్నాడు. రెండు. .మూడే ళ్లకు ఒక్క సినిమా కూడా చేయలేకపోతున్నాడు. మరి తాను స్టార్ అయ్యేదెప్పుడు? తండ్రి లెగస్సీని కొనసాగించేది ఎప్పుడు? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి.
అయితే తనయుడి కోసం తండ్రి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు కనిపిస్తుంది. అందుకోసం స్నేహితుడు డైరెక్టర్ ని బరిలోకి దించుతున్నారు. మమ్ముట్టి హీరోగా రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన బ్రహ్మయుగం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే జోనర్ లో ప్రణవ్ లాల్ తో సినిమా చేయాలని సదాశివన్ ని మోహన్ లాల్ కోరినట్లు సమాచారం.
డైస్ ఇరే అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందట. మధ్యయుగంలో లాటిన్ కవిత ఆధారంగా ఈ టైటిల్ నిర్ణయించారు. అయితే ఇది బ్రహ్మయుగం 2`ని మరో ప్రచారం కూడా తెరపైకి వస్తుంది. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `బ్రహ్మయుగం సక్సస్ పరంగా రీజనల్ మార్కెట్ కే పరిమితమైంది. మాలీవుడ్ మినహా మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో రీజనల్ మార్కెట్ టార్గెట్ గానే ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రణవ్ ఇంకా అక్కడే ఎదగలేదు కాబట్టి పాన్ ఇండియా అటెంప్ట్ అప్పుడే చేయడు. ఇప్పటి వరకూ రొమాంటిక్ సినిమాలు చేసిన ప్రణవ్ కు ఈ జానర్ కొత్తదనే చెప్పాలి. మరి ఇందులో డాడ్ ఏదైనా పాత్ర పోషిస్తున్నాడా? అన్నది సస్పెన్స్. ఆయన ఎంటర్ అయితే మార్కెట్ పరంగా కలిసొస్తుంది. తనయుడి కోసమైనా తప్పక బరిలోకి దిగాలి.