Begin typing your search above and press return to search.

ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!

తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒక మంచి ఏంటంటే సినిమా నచ్చితే అందులో ఉన్న హీరో మనకు తెలిసిన వారా కాదా అనే భావన లేకుండా సినిమా హిట్ చేస్తారు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 10:14 AM GMT
ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
X

తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒక మంచి ఏంటంటే సినిమా నచ్చితే అందులో ఉన్న హీరో మనకు తెలిసిన వారా కాదా అనే భావన లేకుండా సినిమా హిట్ చేస్తారు. కొత్త వారిని ప్రోత్సహించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అందుకే ఏడాదిలో తెలిసిన వారు స్టార్ సినిమాల కన్నా కొత్త వారితో చేసే ప్రయత్నాలే ఎక్కువ. ఈ క్రమంలో ప్రేక్షకులను మెప్పించడం కోసం శంకర్ డైరెక్షన్ ప్రణం దేవరాజ్ హీరోగా చేస్తున్న సినిమా శ్రీకారం చుట్టారు.

ప్రణం దేవ రాజ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్న సినిమా నేడు ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 లో తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా ముహూర్త కార్యక్రమానికి ఆకాష్ పూరీ గెస్ట్ గా వచ్చారు. ఆకాష్ పూరీ క్లాప్ కొట్టగా దేవరాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి తణికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ గా పనిచేస్తున్నారు. ఇది నా మొదటి సినిమా.. అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా వస్తుందని అన్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 3వ వారం నుంచి హైదరాబాద్, వైజాగ్ లో షూట్ చేస్తామని అన్నారు.

సినిమా నిర్మాణం అంటే చాలా ప్యాషన్ ఉండాలి. అలాంటి ప్యాషన్ తో హరి గౌడ్ నిర్మాణం రంగలోకి వచ్చారు. అందుకు సంతోషంగా ఉందని అన్నారు తణికెళ్ల భరణి. దేవరాజు పాన్ ఇండియా యాక్టర్ ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని వాళ్ల అబ్బాయి ప్రణం దేవరాజ్ పుణికిపుచ్చుకుని ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్న ప్రణం దేవరాజ్ ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు. శంకర్ చాలా ప్రతిభ వున్న దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు తీసు రావాలని అన్నారు తణికెళ్ల భరణి.

హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. ఇది నా మూడో సినిమా. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్న కథ ఇది. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ తో వస్తుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలని అన్నారు ప్రణం దేవరాజ్.

దేవరాజ్ మాట్లాడుతూ.. శంకర్ అద్భుతమైన కథను రాసుకున్నారు. కథ బాగుంది..హరి గౌడ్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. మంచి టీం కలసి చేస్తున్న సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు ఉండాలని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఇది మా మొదటి ప్రొడక్షన్. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. మంచి కథతో వస్తున్నాం ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుతున్నామని అన్నారు.