Begin typing your search above and press return to search.

ప్ర‌కాష్‌రాజ్ జీవితంలో తీర‌ని న‌ష్టం..!

ప్రకాష్ రాజ్ పరిశ్రమలో 400 పైగా సినిమాల్లో న‌టించిన మేటి ప్ర‌తిభావంతుడు. విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచాడు

By:  Tupaki Desk   |   2 April 2024 3:22 AM GMT
ప్ర‌కాష్‌రాజ్ జీవితంలో తీర‌ని న‌ష్టం..!
X

ప్రకాష్ రాజ్ పరిశ్రమలో 400 పైగా సినిమాల్లో న‌టించిన మేటి ప్ర‌తిభావంతుడు. విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచాడు. జాతీయ అవార్డు గ్ర‌హీత‌గా గొప్ప గౌర‌వం అందుకుంటున్నాడు. ద‌శాబ్ధాల‌ కెరీర్ లో విభిన్నమైన చిత్రాలతో అల‌రించిన మేటి నటుడు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన ప్రకాష్ రాజ్ భార‌త‌దేశంలో అత్యుత్త‌మ న‌టుల‌లో ఒక‌రిగా ఎదిగేందుకు ఎంత‌గా శ్ర‌మించారో తెలిసిన‌దే. అత‌డు ఇటీవ‌ల‌ రాజకీయ నాయకుడిగా మారడానికి ఏ ఒక్క అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌లేదు. ఒక న‌టుడిగా అత‌డి పీక్స్ గురించి ప్ర‌జ‌ల‌కు తెలుసు. అత‌డి రాజ‌కీయాల గురించి తెలుసు. అయితే అత‌డి వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప్ర‌జ‌ల‌కు తెలిసింది చాలా త‌క్కువ‌.

వ్యక్తిగత అంశాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌కాష్ రాజ్ 1994లో తమిళ సినీ నటి లలిత కుమారిని పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు.. వీరిలో ఇద్దరు కుమార్తెలు.. మేఘన - పూజతో పాటు కుమారుడు సిద్ధూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ వృత్తిప‌రంగా అత్యుత్త‌మ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు అతని కుటుంబం ఒక ఊహించ‌ని ఘ‌ట‌న‌తో విషాదంలో మునిగిపోయింది. న‌టుడిగా అత‌డి స్పీడ్ సరైన వేగంతో కొనసాగుతోంది. కానీ ఇంత‌లోనే సంక్రాంతి పండ‌గకు ముందు అప‌శ్రుతి. జనవరి నెల‌లో గాలిపటం ఎగురవేస్తుండగా పైనుంచి కింద‌ పడిపోవడంతో కుమారుడు సిద్ధూ గాయాల‌తో పోరాడి మార్చి 2004లో మరణించాడు. కొడుకు చనిపోవడంతో ప్రకాష్, లలిత మధ్య సమస్యలు మొదలై విడిపోయారు. వారు 2009లో విడాకులు తీసుకున్నారు. ప్రకాష్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండవసారి వివాహం చేసుకున్నారు. వేదాంత్ అనే కొడుకు ఈ జంట‌కు ఉన్నారు.

ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ తన కుమార్తెలకు తన రెండవ పెళ్లి విషయాన్ని ఎలా బయటపెట్టాడో వివరించాడు. అతడు మాట్లాడుతూ..నేను జీవితాన్ని ఎలా గడుపుతున్నానో నా పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాను. అబద్ధం చెప్పాలనుకోలేదు కాబట్టి నేను నా కుమార్తెలను కూర్చోబెట్టి, లత నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడనప్పటికీ నేను ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నానో వారికి వివరించాను అని తెలిపాడు.

ప్రకాష్ రాజ్- పోనీ వ‌ర్మ జంట‌ తన 11వ వివాహ వార్షికోత్సవాన్ని 24 ఆగష్టు 2021న జరుపుకున్నారు. ప్రకాష్- పోనీ వ‌ర్మ జంట సంతానం అయిన‌ వేదాంత్ తన తల్లిదండ్రుల వివాహ వేడుకను చూడాలనుకున్నందున ఈ వార్షికోత్సవ వేడుక ప్రత్యేకంగా జరిగింది. వారు తమ కుమారుడి అభ్యర్థనను సంతోషంగా అంగీకరించి మళ్లీ వివాహం చేసుకున్నారు. ప్రత్యేకమైన వివాహ వార్షికోత్సవ వేడుకల తర్వాత ప్రకాష్ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన ఫోటోలను ట్విట‌ర్ లో షేర్ చేశారు. మేము ఈ రాత్రికి మళ్లీ పెళ్లి చేసుకున్నాము…ఎందుకంటే మా కొడుకు వేదాంత్ దానికి సాక్షిగా ఉండాలనుకున్నాడు. ఆనంద క్ష‌ణాలివి.. అని రాసారు. ఎంత పెద్ద న‌టుడైనా కానీ త‌న జీవితంలో మ‌ర్చిపోలేని ఆ ఘ‌ట‌న త‌ర్వాత‌ ప‌రిణామాలు త‌న‌కు ఎంతో పాఠం నేర్పాయి.

ప్రకాష్ రాజ్ ప్ర‌స్తుతం 'పుష్ప 2: ది రూల్'లో న‌టిస్తున్నాడు. NBK 109 లోను కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇంకా ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసాడు. బాక్సాఫీస్ హిట్‌ల ప‌రంగా అద్భుత‌మైన‌ ట్రాక్ రికార్డ్‌ను క‌లిగి ఉన్నాడు. విల‌న్ గా, స‌హాయ న‌టుడిగా గొప్ప రికార్డు అత‌డికి ఉంది. ప్ర‌స్తుతం భారీ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ ప్ర‌కాష్ రాజ్ త‌న ఉనికిని చాటుకున్నాడు.