Begin typing your search above and press return to search.

ప్రకృతి ఒడిలో ప్రకాష్ రాజ్ జీవనశైలి

జీవితంలో సంతోషంగా ఉండటమే అన్నింటికంటే ముఖ్యమైనదని ప్రకాష్ రాజ్ ఆచరణలో చూపిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   6 July 2026 12:00 PM IST
ప్రకృతి ఒడిలో ప్రకాష్ రాజ్ జీవనశైలి
X

నటనా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తెరపై ఎంతటి తీవ్రతను ప్రదర్శిస్తారో? నిజ జీవితంలో అంతకంటే ప్రశాంతతను కోరుకుంటారు. సముద్రపు హోరు, చెరువుల ప్రశాంతత, పచ్చని చెట్టు చేమల నడుమ ప్రకృతితో మమేకమై జీవించడం ప్ర‌కాష్ రాజ్ కు ఇష్టం. నటన అనే రంగుల ప్రపంచం నుంచి బయటకు రాగానే తనదైన ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఆ త‌ర్వాత ఫోన్ చేసినా? కూడా అందుబాటులోకి రానంత ప్ర‌శాంత‌త అనే అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.

ప్రకాష్ రాజ్ ఒకచోట స్థిరంగా ఉండ‌రు. తనకంటూ ఎంపిక చేసుకున్న అందమైన ప్రదేశాల్లో సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. ముంబై వంటి నగరాల కోలాహలం నుండి ఊటీ, కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాల సౌందర్యం వరకు సొంత ఇళ్లు విస్తరించి ఉన్నాయి. ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ ప్రాంతాల్లో విలువైన‌ సమయాన్ని గడపడం ఎంతో ఇష్టపడతారు. ప్రతి ఇల్లు ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని, ప్రశాంతతను కలిగి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారుట‌. జీవితం చాలా చిన్నదని, ఉన్న కొద్ది సమయంలోనే మనశ్శాంతిని వెతుక్కోవడం ముఖ్యమని ప్రకాష్ రాజ్ గట్టిగా నమ్ముతారు.

వృత్తిపరంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా? ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా గడిపే ప్రతి క్షణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. కెమెరా ముందు నటుడిగా జీవించినంత కాలం ఒక ఎత్తు అయితే? కెమెరా వెనుక తన ఇళ్లలో జీవించడం మరో ఎత్తు అని భావిస్తారు. ఈ జీవనశైలి ఆయనకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తుంది. ప్రకాష్ రాజ్ గడించే ఈ ప్రశాంతమైన జీవితం, ఆయనలోని నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది. ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా? భూమికి దగ్గరగా ఉండటమే నిజమైన సంతోషమని ఆయన పదే పదే చెబుతుంటారు. తన ఇళ్లను కేవలం విలాసాల కోసం కాకుండా ప్రకృతితో సంభాషించుకోవడానికి ఒక సాధనంగా భావిస్తారు.

ఆ ప్రదేశాల్లోని ప్రతి చెట్టును, ప్రతి మొక్కను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. నిరంతరం కొత్త పాత్రలను పోషించే నటుడికి తన అంతరాత్మను ప్రశాంతంగా ఉంచుకోవడం అంతే అవసరం. ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాల్లోని ప్రకృతి సౌందర్యం ఆయనలో నటనకు అవసరమైన సృజనాత్మకతను నింపుతుందని చెప్పొచ్చు. ప్రకృతిలోని నిశ్శబ్దం, ఆకుల సవ్వడి, గాలిలోని తాజాదనం ప్ర‌కాష్ ఆలోచనలను మ‌రింత పదును పెడుతు న్నాయి. తన పాత్రల్లో కనిపించే లోతైన భావోద్వేగాలకు ఇలాంటి ప్రశాంతమైన జీవనశైలే కారణమని నమ్ముతారు.

జీవితంలో సంతోషంగా ఉండటమే అన్నింటికంటే ముఖ్యమైనదని ప్రకాష్ రాజ్ ఆచరణలో చూపిస్తున్నారు. భౌతిక సుఖాల కంటే ప్రకృతితో గడిపే సమయం మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంద‌ని ఆయన జీవన విధానం చాటి చెబుతోంది. ఆదర్శ వంతమైన జీవనాన్ని కోరుకునే ఎంతోమందికి ప్ర‌కాష్‌ ఎంచుకున్న ప్రకృతి ఒడిలోని ప్రయాణం గొప్ప పాఠంగా చెప్పొచ్చు.