Begin typing your search above and press return to search.

రామాయ‌ణంలో దీపిక డాడ్ న‌టిస్తున్నారా?

బాలీవుడ్ లో దీపికా ప‌దుకొణే ఎంత పెద్ద హీరోయిన్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ భామ‌గా అక్క‌డ కొన‌సాగుతుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 7:30 AM
రామాయ‌ణంలో దీపిక డాడ్ న‌టిస్తున్నారా?
X

బాలీవుడ్ లో దీపికా ప‌దుకొణే ఎంత పెద్ద హీరోయిన్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ భామ‌గా అక్క‌డ కొన‌సాగుతుంది. స్టార్ హీరోల‌కు జోడీగా న‌టిస్తూ సోలోగానూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతుంది. ర‌ణ‌వీర్ సింగ్ ను వివాహం చేసుకుని భార్య‌గా, ఓ బిడ్డ‌కు త‌ల్లిగానూ బాధ్య‌త‌లు చూసుకుంటుంది. ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత ఆ రేంజ్ స్టేట‌స్ ను దీపిక బాలీవుడ్ లో ఆస్వాదిస్తుంది. దీపిక బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

డాడ్ మాజీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ప్ర‌కాష్ ప‌దుకొణే తెలిసిన వారే. కానీ న‌టిగా ఎదిగే క్ర‌మంలో మాత్రం ఓ సామాన్యురాలిలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని హీరోయిన్ గా నిల‌దొక్కుకుంది. ఇప్పుడు డాడ్ ను మించిన ఫాలోయింగ్ దీపిక‌కు ఉంది. అయితే డాడ్ ప్ర‌కాష్ ప‌దుకొణే కుమార్తె రూపంలో త‌న‌కున్న ఓ చిన్న క‌ల‌ను సినిమా రూపంలో నెర వేర్చుకుంటున్న‌ట్లు వినిపిస్తుంది. ఎప్పటి నుంచి రామాయ‌ణంలో ఏదైనా ఓ పాత్ర పోషించాల‌ని ఉందిట‌.

అయితే ఇప్పుడా ఛాన్స్ బాలీవుడ్ రామాయ‌ణం రూపంలో ద‌క్కుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ రాముడిగా, సాయి ప‌ల్ల‌వి సీత‌గా నితీష్ తివారీ 'రామాయ‌ణ్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర‌ను ప్ర‌కాష్ ప‌దుకొణే పోషిస్తున్నారట‌. ఆ పాత్ర ఏంటి? అన్న‌ది తెలియ‌దు గానీ ఆ ఛాన్స్ ఇప్పించింది మాత్రం దీపికా ప‌దుకొణే అని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో మాట్లాడి ఓ చిన్న రోల్ ఇవ్వాల్సిందిగా అభ్య‌ర్దించ‌గా అందుకు వాళ్లు అంగీక‌రిం చారట‌. దీపిక అడ‌గాలే గానీ కాద‌నేది ఎవ‌రు? పైగా ప్ర‌కాష్ ప‌దుకొణే దేశం త‌రుపున ఎన్నో బ్యాడ్మింట‌న్ మ్యాచులు ఆడారు. అలాంటి ఆయ‌న అడిగితే ఛాన్స్ ఇవ్వ‌కుండా ఉంటారా? మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ మెంతో తెలియాలి.